AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి.. పుల్ల పుల్లగా.. కారం కారంగా..

తెలుగువారి వంటకాల్లో గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వంట చేసే ఓపిక లేనప్పుడు లేదా నోరంతా చప్పబడి ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి, కాస్త నెయ్యి, పక్కన ఆమ్లెట్ ఉంటే భోజనం అమృతంలా అనిపిస్తుంది. చాలామంది గోంగూర పచ్చడిని ఎండుమిర్చితో తయారుచేస్తారు; కానీ పచ్చిమిరపకాయలతో చేసే గోంగూర పచ్చడి రుచి మరింత ప్రత్యేకంగా, కమ్మగా ఉంటుంది. గోంగూర సహజంగానే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా పచ్చిమిర్చి కారాన్ని బ్యాలెన్స్ చేయాలి. 

Phani CH
|

Updated on: Oct 09, 2026 | 8:11 PM

Share
కావలసిన పదార్థాలు: 8 మీడియం సైజు గోంగూర కట్టలు,  200 గ్రాముల పచ్చిమిరపకాయలు, ముప్పావు కప్పు వంట నూనె , 1 టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ఆవాలు, 15 నుండి 20 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ ఇంగువ, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు 

1 / 5
తయారీ విధానం:  8 కట్టల గోంగూరను నీటిలో శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్‌పై వేసి ఫ్యాన్ కింద తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఆకులను కాస్త చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనెలో వేసినప్పుడు ఆకులు ఆకులుగా ఉండకుండా చక్కగా మగ్గుతాయి. 200 గ్రాముల పచ్చిమిరపకాయలను తుంపి మిక్సీ జార్‌లో వేసి.. మెత్తటి పేస్ట్‌లా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.

2 / 5
స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టీస్పూన్ మెంతులు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్‌పై మాడిపోకుండా దోరగా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీలో మెత్తటి పొడిలా చేసి పెట్టుకోవాలి.అదే పాన్‌లో ముప్పావు కప్పు నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి లో-మీడియం మంటపై పచ్చివాసన పోయేలా 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత దంచిన 15-20 వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ ఇంగువ వేసి పచ్చిమిర్చి రంగు మారే వరకు సన్నటి సెగపై బాగా వేయించాలి.

3 / 5
పచ్చిమిర్చి వేగిన తర్వాత అర టీస్పూన్ పసుపు, కట్ చేసి ఉంచుకున్న గోంగూర మొత్తాన్ని వేసి కలపాలి. నీళ్లు చుక్క కూడా పోయకుండా.. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టాలి; గోంగూరలోని సహజ తేమతోనే నూనెలో మగ్గిపోతుంది. మధ్యమధ్యలో కలుపుతూ 3 టీస్పూన్ల ఉప్పు వేసి మళ్లీ మూతపెట్టాలి. సుమారు 15 నిమిషాల పాటు సన్నటి సెగపై గోంగూర గుజ్జులా మారి నూనె పైకి తేలే వరకు మగ్గించాలి.ఎక్కువగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా మరిగించిన వేడి నీళ్లను మాత్రమే పోసి మగ్గించవచ్చు.

4 / 5
నూనె తేలిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మెంతి పొడిలోంచి 1 టీస్పూన్ పొడి వేసి కలిపి.. మూతపెట్టి మరొక్క నిమిషం మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే, పుల్లపుల్లగా కారంగా ఉండే 'గోంగూర పచ్చిమిర్చి నిల్వ పచ్చడి' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని, పక్కన ఆమ్లెట్ నంజుకుని తింటుంటే మాటల్లో చెప్పలేనంత కమ్మటి అనుభూతి కలుగుతుంది!

5 / 5
Follow Us
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..

దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!

శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..

మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..

యాక్టర్ నుంచి డాక్టర్‌గా! తల్లి చివరి కోరిక తీర్చిన మాస్టర్ భరత్

దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!

ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా

బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్‌ మొబైల్‌ నంబర్‌ను మార్చుకోండిలా!

కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చా? ఇదిగో సింపుల్ డైట్!

క్యాన్సర్‌ చికిత్స తర్వాత తల్లిపాలు ఇవ్వవచ్చా?