పసిడి ధరలు ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరడంతో కొనుగోలుదారులు హడలిపోతున్నారు. బంగారం కొనుగోలు చేసేదెట్లా అని సామాన్యులు వాపోతున్నారు. మన దేశంలో బంగారు ఆభరణాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ శుభకార్యం అయినా, బంగారం ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.