Ghee for Acne: నెయ్యిని ఇలా వాడారంటే మచ్చలేని ముఖారవిందం మీ సొంతం! ఇప్పుడే ట్రై చేయండి
నెయ్యి అంటే ఇష్టపడని వారుండరు. ఆహారానికి రుచిని తీసుకురావడమేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో చర్మ సంరక్షణలో నెయ్యికి ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ముఖంపై మొటిమల సమస్యలు తొలగించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. మృదువైన, మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది. నెయ్యి ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మొటిమలు అధికంగా వస్తాయి. అందువల్లనే నెయ్యి ఎక్కువగా..
Updated on: Sep 29, 2023 | 1:04 PM

నెయ్యి అంటే ఇష్టపడని వారుండరు. ఆహారానికి రుచిని తీసుకురావడమేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో చర్మ సంరక్షణలో నెయ్యికి ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ముఖంపై మొటిమల సమస్యలు తొలగించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. మృదువైన, మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది.

నెయ్యి ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మొటిమలు అధికంగా వస్తాయి. అందువల్లనే నెయ్యి ఎక్కువగా తినకూడదు. నెయ్యిని తినడం కంటే ముఖానికి కొద్దిగా అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. నెయ్యిలోని హీలింగ్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

నెయ్యిలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌లుగా పనిచేస్తాయి. కాబట్టి చర్మంపై నెయ్యి రాసుకుంటే మొటిమల నొప్పులు, వాపులు, వాపులు తగ్గుతాయి. మీ ముఖంపై మొటిమలు లేకపోయినప్పటికీ చర్మ సంరక్షణకు దీనిని వినియోగించవచ్చు. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. మొటిమలను త్వరగా నయం చేయడమేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మ సంరక్షణ కోసం నెయ్యిని సహజమైన క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు. చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది. ఎల్లప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంటే అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. నెయ్యిలో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా తేమగా ఉండేలా చేస్తాయి.

మొటిమలతోపాటు, వాటి వల్ల వచ్చే మచ్చలు కూడా నెయ్యి నివారిస్తుంది. నెయ్యిలోని హీలింగ్ గుణాలు మొటిమల మచ్చలను తేలికగా తొలగిస్తాయి. అంతేకాకుండా, నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి.





























