AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిజ్‌లో ఈ ఆహార పదార్థాలు పెడుతున్నారా ?? మీ ఆరోగ్యం రిస్క్‌లో పడ్డట్లే.

ఆధునిక బిజీ జీవనశైలిలో ఫ్రిజ్ ప్రతి ఇంటిలో ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి, తాజాగా ఉంచడానికి ఫ్రిజ్‌లు ఉపయోగపడతాయి. అయితే, ఫ్రిజ్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే అది ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  చివరికి ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారితీయవచ్చని తెలుపుతున్నారు.

Phani CH
|

Updated on: Apr 17, 2026 | 7:23 PM

Share
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో రిఫ్రిజిరేటర్లు మన దైనందిన జీవితంలో ఒక అనివార్యమైన భాగంగా మారాయి. వండిన ఆహారాన్ని, పచ్చి కూరగాయలను, పాల ఉత్పత్తులను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అయితే, ఫ్రిజ్‌ను సరైన విధంగా ఉపయోగించకపోతే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, చివరికి ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 7
చాలామంది ఫ్రిజ్ కేవలం ఆహారాన్ని చల్లగా ఉంచి, పాడవకుండా కాపాడుతుందని భావిస్తారు. కానీ, నిల్వ చేసే ఆహార పదార్థాలు, ఫ్రిజ్ యొక్క పనితీరు, తిరిగి వేడి చేసే విధానం వంటి అనేక అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇంట్లో వండిన ఆహారానికి, రెస్టారెంట్లు లేదా ఇతర బయటి ప్రదేశాల నుండి తెచ్చిన ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

2 / 7
బయటి భోజనాల్లో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ తో పాటు అనేక ఎసెన్షియల్స్, ఫుడ్ యాసిడ్స్‌ను అధికంగా కలుపుతారు. ఇవి తక్షణ రుచినిచ్చినా, ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే కార్బోజెనిక్ పాయిజనస్ పదార్థాలు ఏర్పడి, అది విషపూరితం అవుతుంది. జీడిపప్పు వంటి పదార్థాలు కూడా బయటి వంటకాల్లో ఎక్కువగా వాడతారు. ఇవి కూడా త్వరగా పాడైపోయే లక్షణం కలిగి ఉంటాయి. కాబట్టి, రెస్టారెంట్ ఆహారం లేదా ఫంక్షన్ల నుండి తెచ్చిన మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు వాటిని తాజాగా తినడమే మంచిది.

3 / 7
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని తిరిగి తినేటప్పుడు, దానిని పూర్తిగా వేడి చేయడం చాలా ముఖ్యం. కేవలం సాధారణ వేడి సరిపోదు. అందులోని బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయేంత వరకు ఉడకబెట్టాలి. ప్రెషర్ కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు వేడి చేయడం ఒక మంచి పద్ధతి. ఇది ఆహారంలో ఏమైనా విష పదార్థాలు ఏర్పడినా, వాటిని నిర్వీర్యం చేయడంలో సహాయపడుతుంది.

4 / 7
ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలుగురించి తెలుసుకుందాం.  ప్లాస్టిక్ బాటిళ్లను డీప్ ఫ్రీజర్‌లో పెట్టినప్పుడు, అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ప్లాస్టిక్ కణాలు నీటిలోకి లేదా ఆహారంలోకి చేరి, ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

5 / 7
 అరటిపండ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటివి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇవి త్వరగా ఫంగస్ పెరిగే అవకాశం ఉంది.  టమోటాలలో పులుపు శాతం ఎక్కువగా ఉండటం వల్ల, వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే బ్లాక్ ఫంగస్ ఏర్పడవచ్చు. పచ్చి టమోటాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

6 / 7
ఎక్స్‌పైరీ డేట్ దాటిన పుట్టగొడుగులు, పనీర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఫ్రిజ్‌లో పెట్టినా, ఎక్స్‌పైరీ డేట్ తర్వాత అవి విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. పాల ఉత్పత్తులు, పనీర్ నాన్-వెజ్‌ కంటే త్వరగా పాడవుతాయి. షాపుల ఫ్రీజర్ల ఉష్ణోగ్రత, ఇంటి ఫ్రిజ్ ఉష్ణోగ్రత వేరుగా ఉంటాయి. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్‌లను ఇంటి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, అవి ఎక్స్‌ట్రీమ్ కోల్డ్‌కు గురై పాల పదార్థాలు విరిగి, ఫుడ్ పాయిజన్‌కు కారణం కావచ్చు. చాక్లెట్స్‌లో చక్కెర శాతం ఎక్కువ. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పురుగులు పట్టే అవకాశం ఉంది.

7 / 7
Follow Us