AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రకు శత్రువు ఈ ఆహారపదార్ధాలు.. రాత్రి సమయంలో పొరపాటున కూడా వీటిని తినొద్దు..

కొన్ని ఏళ్ల క్రితం వరకూ జీవన శైలిలో నియమాలున్నాయి. ఉదయం లేవడానికి తినడానికి, రాత్రి నిద్రపోవడానికి నిర్దిష్టమైన సమయాన్ని పాటించేవారు. అయితే మారిన కాలంతో పాటు మనుషుల జీవన శైలిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో రాత్రి సమయంలో కూడా రకరకాల ఆహారాన్ని తింటున్నారు. అయితే ఇలా రాత్రి సమయంలో కొన్ని రకాల ఆహారపదార్థాలు తినడం వలన నిద్రని పాడవుతుందట. ఈ రోజు రాత్రి సమయంలో పొరపాటున కూడా తినకూడని ఆరు రకాల ఆహార పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Jun 03, 2025 | 5:10 PM

Share
ఉదయం అల్పాహారం రాజులా.. మధ్యాహ్నం చేసే భోజనం యువరాజులా సాయంత్రం చేసే భోజనం పేదవారిలా ఉండాలని నియమం ఉంది. అందుకనే రాత్రి భోజనంలో తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి. అది కూడా రాత్రి 7 గంటల లోపు తినేయ్యాలి. అయితే రాత్రి త్వరగా నిద్రపోవాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. రాత్రి కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనివల్ల రాత్రి నిద్రపోవడంలో సమస్యలు రావచ్చు.

1 / 6
ముఖ్యంగా నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను రాత్రి సమయంలో తినకూడదు. ఎందుకంటే వీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి ఆమ్లత్వం, గుండెల్లో మంటను కలిగిస్తాయి. కనుక రాత్రి  వీటిని తినొద్దు.

2 / 6
రాత్రి సమయంలో పిజ్జాను తినకూడదు ఎందుకంటే దీనిని పిండి, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో పిజ్జాని రాత్రి సమయంలో తినడం వలన ఆమ్లత్వం లేదా అజీర్ణం వంటి అనేక సమస్యలు కలిగి నిద్రకు భంగం కలిగిస్తాయి.

3 / 6
 
రాత్రి సమయంలో టీ , కాఫీ లు కూడా తాగకూడదు. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది.  నిద్రకు భంగం కలిగిస్తుంది. ఒకవేళ తప్పనిసరిగా టీ కఫీలను తాగాలనిపిస్తే నిద్రపోయే 4 గంటల ముందు కాఫీ లేదా టీ తాగాలి.

4 / 6
రాత్రి సమయంలో బ్రెడ్ తినొద్దు. ఎందుకంటే ఇందులో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి, ఆరోగ్యానికి హానికరం. కనుక రాత్రి సమయంలో బ్రెడ్ తినడం మీ నిద్రకు శత్రువుగా మారవచ్చు.

5 / 6
రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్ధాలను పొరపాటున కూడా తినొద్దు. ఎందుకంటే ఈ ఆహార పదార్ధాలను తినడం వలన జీర్ణ సమస్యలే కాదు.. రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య వస్తుంది. చాలా మందికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అయితే రాత్రి చాక్లెట్ ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అంతేకాదు రాత్రి సమయంలో నిద్ర పోవడంలో ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు.

6 / 6