AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avisa Ginjala Karam Podi: జుట్టు రాలడం ఆగి, ఎముకలు ఉక్కులా మార్చే అవిసె గింజల కారప్పొడి

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు జుట్టు రాలడం, మోకాళ్ల నొప్పులు మరియు బరువు పెరగడం. వీటన్నింటికీ విడివిడిగా మందులు వాడటం కంటే, మన వంటింట్లోనే సహజసిద్ధంగా లభించే సూపర్ ఫుడ్స్ ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. అటువంటి శక్తివంతమైన పదార్థాలలో 'అవిసె గింజలు' అగ్రస్థానంలో ఉంటాయి.

Phani CH
|

Updated on: Sep 15, 2026 | 7:36 PM

Share
వీటిలో పుష్కలంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అయితే చాలామందికి అవిసె గింజలను ఎలా తినాలో తెలియదు. చుక్క నూనె కూడా ఉపయోగించకుండా, కాల్షియం నిండిన తెల్ల నువ్వులు, జీర్ణశక్తిని పెంచే ధనియాలు, జీలకర్ర మరియు వెల్లుల్లితో కమ్మని 'అవిసె గింజల కారప్పొడి' చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఈ హెల్దీ కారప్పొడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 6
కావలసిన పదార్థాలు: 1 కప్పు అవిసె గింజలు, పావు కప్పు తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు, గుప్పెడు తాజా కరివేపాకు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు

2 / 6
తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. ముందుగా ఒక కప్పు అవిసె గింజలను వేసి లో ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుతూ చిటపటలాడేంత వరకు ఓపికగా వేయించాలి. అవిసె గింజలు వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో తెల్ల నువ్వులను కూడా వేసి చిటపటలాడే వరకు చిన్న మంటపై వేయించి తీసుకోవాలి.

3 / 6
అదే పాన్‌లో ధనియాలు వేసి దోరగా వేపి తీయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.  అనంతరం జీలకర్రను మంచి సువాసన వచ్చేవరకు వేపి తీసుకోవాలి. తర్వాత కడిగి ఆరబెట్టిన కరివేపాకును క్రిస్పీగా మారే వరకు వేయించాలి. చివరగా ఎండుమిరపకాయలను కూడా లో ఫ్లేమ్‌పై మాడకుండా దోరగా వేయించి అన్నింటినీ ఒక ప్లేట్‌లో చల్లారనివ్వాలి.

4 / 6
వేయించిన దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి మార్చుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మొదట మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా పొట్టు తీసిన లేదా పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి పల్స్ చేస్తూ తిప్పాలి. వెల్లుల్లిని ముందే వేస్తే పొడి ముద్దవుతుంది.

5 / 6
పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం మొదటి ముద్ద వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ అవిసె గింజల కారప్పొడి, కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని తిన్నా లేదా వేడి ఇడ్లీ, దోశలపై చల్లుకుని తిన్నా జుట్టు రాలడం తగ్గి ఎముకలు ఉక్కులా దృఢంగా మారతాయి!

6 / 6
Follow Us