ఇన్నాళ్లు తప్పు చేశామా?.. ఉడికించిన గుడ్లు ఎన్ని రోజుల్లోపు తినాలి!

 15 Sep 2026

Anand T

కొన్ని సార్లు గుడ్లు ఉడకబెట్టాక ఎక్కువైతే చాలా మంది వాటిని తర్వాత తిందామని పక్కిన పెడుతుంటారు. మరీ వాటిని ఎంత సమయంలో తినాలి.. ఎక్కవ సమయం తర్వాత తింటే ఏమౌతుంది.

ఉడికించిన గుడ్డు

ఉడికించిన గుడ్లను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోచే అవకాశం ఉంది. కాబట్టి స్టోర్ చేయడంలో జాగ్రత్త పాటించాలి.

సరైన స్టోరేజ్

మీరు ఉడికించిన గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటల కంటే ఎక్కువ సమయం బయట ఉంచకూడదు. అదే వేడి వాతావరణం ఉన్న ప్రదేశాలలో అయితే 1 గంట లోపే తినేయాలి లేదా వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి.

సరైన ఉష్ణోగ్రత

ఉడికించిన గుడ్లను పెంకు తీయకుండా ఉంచితే ఫ్రిజ్‌లో దాదాపు 7 రోజుల వరకు తాజాగా స్టోర్ చేసుకోవచ్చు.

ప్రిజ్‌లో 7డేస్

గుడ్డులోని పోషకాలు కోల్పోకుండా ఉండాలంటే.. ఉడికించిన తర్వాత తినే ఉద్దేశం లేకపోతే వాటి పెంకు తీయకుండా పెట్టండి.

పెంకు తీయకపోవడం

ఒక వేళ మీరు పెంకు తీసేస్తే ఉడికించిన గుడ్లను ఫ్రిజ్‌లో ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచి, 1 నుండి 2 రోజుల్లోపే తినేయాలి.

పెంకు తీస్తే

గుడ్లు ఎక్కవ కాలం తాజాగా ఉండాలంటే  ఉడికించిన వెంటనే వాటిని చల్లనీటిలో వేయండి.. తర్వాత వాటిని ఫ్రిజ్‌లో భద్రపరిస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

చల్లటి నీటిలో

గుడ్డు నుంచి వింత దుర్వాసన రావడం, జిగటగా మారడం లేదా రంగు మారినట్లు కనిపిస్తే వాటిని అస్సలు తినకూడదు. అవి తింటే అజీర్తి, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

పాడైన గుడ్ల లక్షణాలు