- Telugu News Photo Gallery Flax Seeds are reduce sugar levels and weight reduction, Check Here is Details
Falx Seeds: డయాబెటీస్‌ని, బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేసే గింజలు..
ఈ మధ్య కాలంలో అవిసె గింజలను తీసుకోమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటున్నరు. ఈ గింజల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఆహారంలో విత్తనాలను తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. చూడటానికి ఇవి చిన్నగా ఉన్నా.. ఆరోగ్యాన్ని పెంచడంలో ఎంతో చక్కగా పని చేస్తాయి. ప్రతి రోజూ ఒక స్పూన్ తీసుకున్నా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది..
Updated on: Jan 26, 2025 | 6:20 PM

ఆరోగ్యాన్ని పెంచడంలో గింజలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. గింజల్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధుల్ని నియంత్రించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. గింజల్లో అవిసె గింజలు కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది వీటిని తీసుకుంటూ ఉన్నారు.

అవిసె గింజల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ గింజల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది.

ప్రతి రోజూ ఒక రెండు స్పూన్ల అవిసె గింజలు తీసుకుంటే.. చక్కగా ఫైబర్ అందుతుంది. ఇది జీర్ణ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.

అవిసె గింజలలో ఉండే లిగ్నన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో అవిసె గింజలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా అనిపించేలా చేయడం ద్వారా అతిగా తినకుండా చేస్తుంది. ఈ విధంగా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు.

అవిసె గింజల్లో ఉండే పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. అవిసె గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అమృతంలా పనిచేస్తాయి.





























