- Telugu News Photo Gallery Eating these foods will not cause hemoglobin deficiency, Check here is details in Telugu
Hemoglobin Foods: ఈ ఆహారాలు తీసుకుంటే.. హిమోగ్లోబిన్ కొరతనే ఉండదు..
శరీరంలో తగిన పరిమాణంలో హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎనీమియా ప్రాబ్లమ్‌తో బాధ పడుతున్నారు. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. మీ డైట్‌లో కొన్ని రకాల ఆహారాలను యాడ్ చేసుకోవాలి. దీంతో ఎనీమియా సమస్యలను దూరం..
Updated on: Apr 01, 2024 | 3:06 PM

శరీరంలో తగిన పరిమాణంలో హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎనీమియా ప్రాబ్లమ్‌తో బాధ పడుతున్నారు.

ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. మీ డైట్‌లో కొన్ని రకాల ఆహారాలను యాడ్ చేసుకోవాలి. దీంతో ఎనీమియా సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కోడి గుడ్లు అనేవి సమృద్ధికరమైన ఆహారం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతి రోజూ గుడ్డు తినమంటారు. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే.. ఎనీమియా సమస్యల నుంచి బయట పడొచ్చు.

రెడ్ మీట్ తిన్నా హిమోగ్లోబిన్ లెవల్స్ బాగా పెరుగుతాయి. ఇందులో విటమిన్లు ఎ, డి, ఐరన్, జింక్, పొటాషియం ఉంటాయి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో తృణ ధాన్యాలను కూడా సహాయ పడతాయి. కాబట్టి వీటిని కూడా తీసుకుంటూ ఉండాలి.

అదే విధంగా ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటే.. రక్త హీనత సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఆకు కూరలు, కూరగాయలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.




