- Telugu News Photo Gallery Dry Fruits for Diabetes: These three dry fruits will keep sugar under control
Dry Fruits for Diabetes: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపాలిట ఆ మూడు డ్రై ఫ్రూట్స్ దివ్యౌషధాలు.. ఉదయాన్నే కాసిన్ని నానబెట్టి తిన్నారంటే
డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి అవసరమైన చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, ఇతర సప్లిమెంట్లను తీసుకోవలసిన అవసరం ఉండదు. డయాబెటిస్ పేషెంట్లు తమ ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాం.. వేరుశెనగలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి..
Updated on: Dec 28, 2023 | 11:58 AM

డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి అవసరమైన చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, ఇతర సప్లిమెంట్లను తీసుకోవలసిన అవసరం ఉండదు. డయాబెటిస్ పేషెంట్లు తమ ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాం..

వేరుశెనగలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ డయాబెటిక్ రోగులకు చాలా మేలు చేస్తాయి. నిపుణులు కూడా ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని సూచిస్తుంటారు.

బాదంలో మెగ్నీషియం ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. నట్స్‌లో విటమిన్ డి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే అధిక కొవ్వు, ప్రొటీన్, పీచు పదార్ధాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

Dry Fruits

వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య ప్రభావాలను నివారిస్తాయి. ఎల్లప్పుడూ ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినాలి. వీలైతే కొద్దిగా నానబెట్టి తినడానికి ప్రయత్నించండి. ఇవి త్వరగా జీర్ణమై సంపూర్ణ పోషణను అందిస్తుంది.





























