Clothing Care: బట్టల వెనుక ఉన్న ఈ ట్యాగ్‌లు దేనిని సూచిస్తాయో తెలుసా?
మనం చాలా రకాల బ్రాండ్స్ బట్టలు కొంటూ ఉంటాం. కొన్ని సార్లు అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలియకపోవడం. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చాలా బ్రాండ్స్ వాటి క్లాత్స్ లోపల కొన్ని ట్యాగ్స్‌ను ఇస్తాయి. చాలా మంది వీటిని బ్రాండ్ ప్రమోషన్ అనుకుంటారు. కానీ ఇవి బట్లలను ఎలా ఉతకాలి, ఎలా ఆరబెట్టాలి, ఎలా ఇస్త్రీ చేయాలి లేదా డ్రై క్లీన్ చేయాలి అనే వివరాలను మెన్షన్ చేస్తాయి. ఈ విషయం తెలియక చాలా మంది వీటిని పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ట్యాగ్స్ గురించింది తెలుసుకుందాం.
Updated on: Sep 09, 2025 | 6:49 PM

మీరు వస్త్రం ట్యాగ్‌పై చిన్న చేతి చిహ్నాన్ని చూసినట్లయితే, ఆ దుస్తులను చేతితో మాత్రమే ఉతకాలని అర్థం. ఇందులో పట్టు, లేస్ లేదా ఎంబ్రాయిడరీ బట్టలు ఉంటాయి. వీటిని యంత్రంలో ఉంచితే సులభంగా దెబ్బతింటాయి. కాబట్టి, అలాంటి దుస్తులను కొద్దిగా తేలికపాటి సబ్బు, చల్లటి నీటితో చేతితో ఉతకడం మంచిది. ఒక వేళ మీరు వస్త్రంపై సర్కిల్ గుర్తును చూస్తే. అది మీకు క్లాత్‌ను డ్రై క్లీన్ చేయాలని సూచిస్తుంది. ఖాళీ సర్కిల్ ఉంటే, ఆ వస్త్రాన్ని ప్రొఫెషనల్‌గా డ్రై క్లీన్ చేయాలని అర్థం. అలా కాకుండా సర్కిల్‌పై క్రాస్ మార్క్ ఉంటే, ఆ క్లాత్‌ను డ్రై క్లీనింగ్ చేయరాదని అర్థం.

మీకు బట్టలకు ఉన్న ట్యాగ్‌పై ముడతలు పడిన చిహ్నం కనిపిస్తే.. ఈ చిహ్నం ఉతికిన బట్టలను పిండాల వద్దా అనేది సూచిస్తుంది. మీ ట్యాగ్‌పై మడతలు పడిన క్లాత్ గుర్తు ఉంటే మీరు దాన్ని దానిని పిండవచ్చు. అలా కాకుండా దానిపై ఒక క్రాస్ మార్క్ ఉంటే, అలాంటి బట్టలను ఉతికిన తర్వాత పిండకుండా నేరుగా నీటిలోంచి తీసి ఆరవేయాలని అర్థం.

ఒక వేళ మీ క్లాత్ ట్యాగ్‌పై మీరు లోపల సర్కిల్ ఉన్న బాక్స్ గుర్తు కనిపిస్తే.. అది మీకు బట్టలను ఎలా ఆరబెట్టాలనేది తెలియజేస్తుంది. బాక్స్ లోపల ఒక సర్కిల్ ఉంటే ఆ బట్టలను డ్రైయర్‌లో ఆరబెట్టవచ్చు. కానీ అదే గుర్తుపై క్రాస్ మార్క్ ఉంటే, ఆ బట్టలను యంత్రంలో ఆరబెట్టకూడదని అర్థం. అలాంటి సందర్భాలలో బట్టలను నార్మల్‌గా దండంపై ఆరబెట్టడం ఉత్తమం.

మీ క్లాత్ ట్యాగ్‌పై ఇస్త్రీ గుర్తు ఉంటే.. అది లోపల ఉన్న చుక్కలు ఉష్ణోగ్రత నియంత్రణను సూచిస్తాయి. ఒక వేళ్ల ట్యాక్‌పై ఇస్త్రీ గుర్తులో చిన్న చుక్క ఉంటే, అలాంటి బట్టలను తక్కువ వేడితో ఐరన్ చేయాలని అర్థం. ఈ గుర్తు ఎక్కువగా పట్టు లేదా సున్నితమైన బట్టలపై ఉంటుంది. ఒక వేళ రెండు చుక్కలు ఉంటే, మీడియం వేడిని ఉపయోగించాలని అర్థం. ఈ గుర్తు ఎక్కువగా పాలిస్టర్, రేయాన్ వంటి సింథటిక్ బట్టలపై ఉంటుంది. మూడు చుక్కలు ఉంటే, అధిక వేడిని ఉపయోగించవచ్చని అర్థం. ఇది గుర్తు ఎక్కువగా పత్తి ,నార వంటి బలమైన బట్టలపై ఉంటుంది. అదే సమయంలో, చుక్కలు లేకుండా ఇస్త్రీ గుర్తు ఉంటే, ఫాబ్రిక్‌ను ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఇస్త్రీ చేయవచ్చని అర్థం

కాబట్టి, మీ బట్టలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలనుకుంటే.. వాటి ట్యాగ్స్‌పై ఉన్న గుర్తులను పాటిస్తూ మీ బట్టలను శుభ్రం చేయండి.( NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన అంశాల ఆధారంగా అందించడం జరిగింది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)




