ఆప్రికాట్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. కెరోటినాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ ఎండిన ఆప్రికాట్‌లలో సమృద్ధిగా లభిస్తాయి. ఆప్రికాట్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని మెరుగుపర్చడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ పండు తినడం చాలా మంచిది.