- Telugu News Photo Gallery Diwali Dream Meanings, are you getting these things in your dream, then you may get Fortune and Wealth
Diwali Dreams: దీపావళికి ముందు మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా.? అయితే మీరు పట్టిందల్లా బంగారమే
దీపావళి పండుగకు ముందు వచ్చే కలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అప్పుడు వచ్చు కొన్ని కలలు మీ జీవితంలో శుభ సంకేతాలను ఇస్తాయి. అలానే ఆర్థిక, వ్యక్తిగత శ్రేయస్సును కూడా అంచనా వేస్తాయి. కలల శాస్త్రం ప్రకారం, పండుగకు ముందు మల కలలో కనిపించే కొన్ని వస్తువులు మన అదృష్టం, సంపద, ఆనందాన్ని సూచిస్తాయి. కాబట్టి ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
Updated on: Oct 14, 2025 | 11:49 AM

దివాళి పండుగకు ముందు మీ కలలో కమలం పువ్వు కనిపిస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. కలలో కమలం పువ్వు చూడటం అంటే మీ ఇల్లు ఆనందం, శ్రేయస్సు, శాంతితో వెలిగిపోతుందని అర్థం. కలలో కమలం పువ్వు రావడం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది.

ఒక వేళ పండగకు ముందు మీ కలలో ఆవు కనిపిస్తే.. అది కూడా శుభ సంకేతమే. ఆ ఆవు ఆ వ్యక్తికి విజయం, ఆర్థిక మెరుగుదల, చట్టబద్ధమైన లాభాలను సూచిస్తుంది. దీని అర్థం మీ ఆర్థిక సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారని

ఒక వేళ పండగకు ముంకు బంగారం లేదా డబ్బు గురించి కలలు వస్తే.. మీరు భవిష్యత్తులో సంపద, ఆర్థిక లాభాలు పొందుతారని అర్థం. ఇలాంటి కలలు ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలను సూచిస్తాయి. అలాగే మీ జీవితంలో మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు.

అలా కాకుండా మీకుఉ నదుల, ముఖ్యంగా పవిత్ర నదుల గురించి కలలు వస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తారు. ఈ కల ఆర్థిక సమస్యల నుండి త్వరగా మీకు ఉపశమనం కలిగించి.. జీవితంలో శాంతి నెలకొల్పే మార్గాలను సూచిస్తుంది.

మీ కలలో దేవాలయం లేదా దీపం కనిపిస్తే త్వరలో మీ జీవితంలో వెలుగు, విజయాలను చూస్తారని సంకేతం. దీపావళి పండుగకు ముందు ఇలాంటి కలలు వస్తే భవిష్యత్తులో మీరు శుభవార్తలు వింటారని అర్థం. కాబట్టి, దీపావళికి ముందు మీరు చూసే కలలను అస్సలు విస్మరించకండి. అవి మీ జీవితంలో శుభం, సంపద, ఆనందానికి సంకేతాలుగా పనిచేస్తాయి.




