AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. తస్మాత్‌ జాగ్రత్త.. ఆ వ్యాధి కావచ్చు!

ప్రస్తుత జనరేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 40 శాతానికిపైగా జనాలు షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు కారణం మారుతున్న లైఫ్‌ స్ట్రైల్‌, మనం తీసుకునే ఆహారం. ముఖ్యంగా ఇండియాలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే ఈ వ్యాధిని లక్షనాలను ముందే గుర్తించి పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ వ్యాధి లక్షనాలు సాధారణ సమస్యల మాదిరి ఉండడంతో వీటిని గుర్తించడం కష్టతరంగా ఉంటుంది. అయితే ఈ కొన్ని లక్షణాలు మీలో కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి.

Anand T
|

Updated on: Jul 31, 2025 | 2:59 PM

Share
మన శరీరంలో కనిపించే ఈ కొన్ని మార్పుల ద్వారా మనం డయాబెటీస్‌ను ఈజీగా గుర్తించవచ్చు. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా దాహం వేయడం. కొన్ని సార్లు మనం ఎన్ని నీరు తాగినా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంటుంది. మన రక్తంలో ఉండే షుగర్‌ లెవెల్స్‌ కణజాలాలను నిర్జలీకరణం చేయడం వల్ల మనకు మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. ఇది షుగర్‌ వ్యాధికి ఒక సంకేతం కావచ్చు.

1 / 5
రెండో సంకేతం ఇది అందరికీ తెలిసిందే తరచూ మూత్రవిసర్జన రావడం ఇది కూడా డయాబెటీస్‌కు ఒక సంకేతం. మన  రక్తంలో గ్లూకోజ్ లెవెత్స్‌ ఎక్కువైనప్పుడు మూత్రపిండాలు షుగర్‌ను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపుతాయి. మనం ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం కూడా ఈ వ్యాధి వచ్చేందుకు సంకేతం కావచ్చు.

2 / 5
షుగర్‌ వ్యాధికి మరో ముఖ్యమైన సంకేతం అలసట, బలహీనతగా ఉండటం. కొన్నిసార్లు ఎంత తిన్నా కూడా మనకు బలహీనతగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మనకు సరైన విశ్రాంతి లేకపోవడం, మన కణాల శక్తి కోసం తగినంత గ్లూకోజ్ అందకపోవడం. ఇదే కాకుండా ఈ షుగర్ వ్యాధి కారణంగా మన కళ్లు కూడా కొన్ని సార్లు మసకబారినట్టు కనిపిస్తాయి.

3 / 5
షుగర్‌ ఉన్న వ్యారికి గాయాలు కూడా తొందరగా నయం కావు. ఎందుకంటే డయాబెటీస్‌ మన శరీరంలోని రక్త ప్రసరణపై ప్రభావం చూపుతోంది. దీంతో మన శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణించి గాయాలు తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది.

4 / 5
మన కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం కూడా డయాబెటీస్‌కు ఒక సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో ఉండే అధిక బ్లడ్‌ షుగర్‌  నరాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు జలదరింపులు వస్తాయి. ఈ సమస్యకు త్వరితగతిన చికిత్స తీసుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

5 / 5