AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ప్రేమ, పగ మధ్య నలిగిపోయే జంట.. థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ..

ప్రేమ, ప్రతీకారం, హింస నేపథ్యంలో తెరకెక్కిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటించగా, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Rajitha Chanti
|

Updated on: Oct 17, 2026 | 10:48 AM

Share
ఒకవైపు పోలీసుల వేట.. మరోవైపు ప్రాణంగా ప్రేమించిన వాళ్లను కోల్పోయిన క్షోభ.. ఇంకోవైపు బతకడానికి ప్రతిక్షణం సాగే పోరాటం. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ గ్యాంగ్‌స్టర్ కథే 'డీసీ ది బ్లడీ వాలెంటైన్' (DC The Bloody Valentine). ప్రేమ, ప్రతీకారం, హింస అడుగడుగునా నిండిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి డిజిటల్ బాట పట్టింది.

1 / 5
 దేవదాస్‌ అలియాస్‌ దాస్‌ ఓ గ్యాంగ్‌స్టర్. తన అనుచరులతో కలిసి పోలీసుల నుంచి ఆయుధాలను దొంగిలించే అతడి జీవితం నేరాల ప్రపంచంలో సాగుతుంటుంది. అయితే ఓ మహిళ తన భర్తను పోలీసు అధికారి చంపేశాడని, తన కుమారుడి చదువు కోసం దాచుకున్న డబ్బును కూడా లాక్కున్నాడని దాస్‌ను ఆశ్రయిస్తుంది. ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాస్‌ ఆ పోలీసును మట్టుబెడతాడు. దీంతో పోలీసుల అటెన్షన్ మొత్తం దాస్‌పై పడుతుంది.

2 / 5
అరసు నేతృత్వంలోని పోలీస్ బృందం దాస్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో కోయంబత్తూరు చేరుకున్న దాస్‌కు, బార్‌లో పాటలు పాడే పార్వతితో పరిచయం ఏర్పడుతుంది. కానీ పోలీసుల దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో దాస్‌ జీవితం మరో మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి ఈరోడ్‌కు చేరుకున్న దాస్‌.. అక్కడ ఎన్నో ఏళ్లుగా దోపిడీకి, వేధింపులకు గురవుతున్న చంద్ర అనే మహిళను కలుస్తాడు.

3 / 5
ఆమె పరిస్థితి చూసి చలించిపోయి, ఆ నరకం నుంచి బయటపడేందుకు సహాయం చేస్తాడు. చంద్ర కూడా అతడితో కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటుంది. అయితే గతం నుంచి వెంటాడుతున్న ప్రమాదాలు వారిని వదలవు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ, తమకంటూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని వెతుక్కునే క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఈ కథ ఎక్కడికి దారి తీసింది? అనేది సినిమాలోని అసలు మలుపు.

4 / 5
ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సోనీలివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తమిళం మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించవచ్చు.

5 / 5
Follow Us