AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karam Borugulu: కారం బొరుగులు ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులైనా మెత్తబడవు

సాయంత్రం నాలుగు గంటల వేళ వేడివేడి కాఫీ లేదా టీ పక్కన పెట్టుకుని కరకరలాడే స్నాక్స్ తినాలని ఎవరికి ఉండదు? అయితే నూనెలో డీప్ ఫ్రై చేసే సమోసాలు, బజ్జీలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటప్పుడు చాలా తక్కువ నూనెతో, క్షణాల్లో చేసుకునే అద్భుతమైన టీ టైమ్ స్నాక్ కారం బొరుగులు.

Phani CH
|

Updated on: Sep 13, 2026 | 9:12 PM

Share
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ ఈ బొరుగుల పోపును ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ట్రావెలింగ్ వెళ్లేటప్పుడు లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌ల కోసం ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి.  ఈ సింపుల్ అండ్ క్రిస్పీ కారం బొరుగుల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 6
కావలసిన పదార్థాలు: ఒక పెద్ద గిన్నెడు మరమరాలు / బొరుగులు, 2 టేబుల్ స్పూన్ల నూనె,  పావు కప్పు వేరుశనగ గుళ్లు, పావు కప్పు పుట్నాల పప్పు, ఆవాలు,  అర టీస్పూన్ జీలకర్ర, 6 నుండి 8 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు,  2 ఎండుమిర్చి, రెండు రెమ్మల తాజా కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూ కారం పొడి, పావు టీస్పూన్ చాట్ మసాలా లేదా గరం మసాలా, మరియు రుచికి సరిపడా ఉప్పు .

2 / 6
తయారీ విధానం: ఒకవేళ మీరు తీసుకున్న బొరుగులు కొద్దిగా మెత్తబడి ఉంటే.. ముందుగా పొడి బాండీలో వేసి చిన్న మంటపై 2 నిమిషాలు వేయిస్తే తిరిగి సూపర్ క్రంచీగా మారతాయి. స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ లేదా కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి.

3 / 6
పల్లీలు సగం వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసి మరో నిమిషం వేపాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మరియు తాజా కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లి, కరివేపాకు మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి.

4 / 6
మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి పసుపు, కారం పొడి, కొద్దిగా సాల్ట్ మరియు కాస్త చాట్ మసాలా లేదా గరం మసాలా వేసి నూనెలో త్వరగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా వెంటనే జాగ్రత్తపడాలి. తాలింపు సిద్ధమైన వెంటనే బొరుగులను బాండీలో వేసి గరిటెతో కింద నుంచి పైకి అంతా సమంగా కలిసేలా బాగా కలపాలి.

5 / 6
లో ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కారం బొరుగులు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే నెల రోజుల పాటు కరకరలాడుతూ ఎంతో తాజాగా ఉంటాయి. ఈ కారం బొరుగుల్లో సన్నటి ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని తింటే రోడ్డు పక్కన బండి మీద దొరికే 'ముంత మసాలా' టేస్ట్ ఇంట్లోనే అదిరిపోతుంది!

6 / 6
Follow Us
కారం బొరుగులు ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులైనా మెత్తబడవు

ఇంట్లో బొప్పాయి చెట్టు పూత రాలిపోతోందా?ఇలా చేశారంటే కాయల వర్షమే!

నేను చేసింది దీని కోసమా.. ? హీరోయిన్ ఆవేదన..

మహీంద్రా కొత్త ఎస్‌యూవీ మైలేజీతో పెట్రోల్ ఖర్చులకు నో టెన్షన్​

ఇదేదో పిచ్చి పూల మొక్క అనుకుంటే ఫుల్‌ అవుతారు..షుగర్, బిపికి చెక్

టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు..

ఎప్పటికీ దీ బెస్ట్ కంది పొడి.. అన్నంలో నెయ్యి వేసుకుని తింటే

బోట్‌ పార్టీపల్‌ 390 ప్లస్‌ ఫీచర్లు, ధర తెలిస్తే షాకవుతారు

సామ్‌సంగ్‌కు పోటీగా యాపిల్ సంచలనం.. ఐఫోన్‌ Duo ధర తెలుసా

అమ్మాయిలను చంపి ఆపై.. OTT ట్రెండింగ్ లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్