AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నీరు లేకుండా కరకరలాడే క్యాబేజీ పకోడీ.. ఇలా చేస్తే అదిరిపోద్ది అంతే

సాయంత్రం చల్లటి వేళ లేదా వర్షం పడుతున్నప్పుడు వేడివేడి టీతో పాటు నంజుకోవడానికి ఏదైనా క్రిస్పీ స్నాక్ ఉంటే భలే ఉంటుంది. సాధారణంగా మనం ఎక్కువగా ఉల్లిపాయ పకోడీ చేస్తుంటాం. కానీ ఇంట్లో క్యాబేజీ ఉన్నప్పుడు ఆ కూర తినడానికి పిల్లలు, పెద్దలు చాలామంది మారాం చేస్తుంటారు. అయితే అదే క్యాబేజీతో కరకరలాడే పకోడీ చేసి పెడితే క్యాబేజీతో చేశారని చెబితే తప్ప ఎవరూ నమ్మలేనంత రుచిగా ఉంటుంది. కొద్దిగా కూడా నీరు కలపకుండా, క్యాబేజీలోని సహజ తేమతోనే పిండి కలుపుతూ, రోడ్డు పక్కన బండ్ల మీద అమ్మే పకోడీ రుచితో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Phani CH
|

Updated on: Sep 03, 2026 | 6:08 PM

Share
కావలసిన పదార్థాలు: రెండు కప్పుల సన్నగా తరిగిన క్యాబేజీ తురుము,  ఒక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి తరుగు, అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ కారం,  అర టీస్పూన్ జీలకర్ర, రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, అర కప్పు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి,  పావు టీస్పూన్బే కింగ్ సోడా / వంటసోడా, ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె, రుచికి సరిపడా ఉప్పు మరియు డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

1 / 5
తయారీ విధానం:  ముందుగా క్యాబేజీని కడిగి ఆరబెట్టిన తర్వాత, బంగాళాదుంప స్లైసర్ లేదా కత్తితో వీలైనంత సన్నని పొడవాటి ముక్కలుగా తరిగి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ క్యాబేజీ తురుములో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను చేత్తో నలుపుతూ వేయాలి.

2 / 5
ఆ తర్వాత కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. దీనిలో అర కప్పు శనగపిండి మరియు పకోడీ సూపర్ క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి కలపాలి.

3 / 5
ఇందులో చుక్క నీళ్లు కూడా పోయకూడదు. ఉప్పు, కారం వేసి చేత్తో గట్టిగా పిసుకుతూ కలిపితే క్యాబేజీ మరియు ఉల్లిపాయల్లోని సహజ తేమ బయటకు వచ్చి పిండి పర్ఫెక్ట్‌గా నానుతుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బాగా కాచిన వేడి నూనె, పావు టీస్పూన్ వంటసోడా వేసి బాగా కలపాలి. కాచిన నూనె వేయడం వల్ల పకోడీ గుల్లగా, ఎంతో కరకరలాడుతూ వస్తుంది.

4 / 5
స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె సరిగ్గా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు కలిపిన పిండిని మరీ ముద్దలుగా కాకుండా, చేతి వేళ్లతో విడివిడిగా తుంచుతూ కాగుతున్న నూనెలో వేయాలి. హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం మంటపైనే అటూ ఇటూ తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ మరియు క్రిస్పీగా మారేంత వరకు వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే కరకరలాడే క్యాబేజీ పకోడీ సిద్ధం! వేడివేడి టీతో తిన్నా లేదా టమాటా సాస్‌తో నంజుకున్నా ఉల్లిపకోడీ కంటే ఎంతో రుచిగా ఉంటుంది!

5 / 5
Follow Us