- Telugu News Photo Gallery Cricket photos Yograj Singh Again Makes Serious Allegations on MS Dhoni Telugu News
MS Dhoni: ‘ధోని నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు’.. మరోసారి నిప్పులు చెరిగిన యూవీ తండ్రి
Yograj Singh: యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మరోసారి 2011 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేశాడు. బహిరంగంగా ధోనీపై విమర్శలు గుప్పించారు. యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడంటూ యోగరాజ్ ఆరోపించారు.
Updated on: Sep 02, 2024 | 1:29 PM

క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీని అజాతశత్రు అంటారు. అంటే, ధోనీని ఎదిరించే వారెవరూ లేరనే సామెత క్రికెట్ సర్కిల్‌లో వినిపిస్తోంది. కానీ, ధోనిని చూస్తే మాత్రం ఇండియాలో ఓ వ్యక్తి విమర్శలు గుప్పిస్తారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్.

యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మరోసారి 2011 ప్రపంచకప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేశాడు. బహిరంగ వేదికలపై ధోనీపై విమర్శలు గుప్పించారు. యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని యోగరాజ్ ఆరోపించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని యోగరాజ్ ఆరోపించారు. ధోనిని ఎప్పటికీ క్షమించలేనంటూ చెప్పుకొచ్చాడు. ధోనీ గురించి ఆయన మాట్లాడుతూ, 'ఎంఎస్ ధోనీని నేను క్షమించను. అద్దంలో తమ ముఖాన్ని చూసుకోని, ఆత్మ పరిశీలన చేసుకోవాలి' అంటూ ఘాటుగా మాట్లాడాడు.

అతనో గొప్ప క్రికెటర్ అయితే నా కొడుకుని ఏం చేశాడో ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. అతన్ని ఎప్పటికీ క్షమించలేడు. నా జీవితంలో నేను ఎప్పుడూ రెండు పనులు చేయలేదు - మొదటిది, నాకు అన్యాయం చేసిన వారిని నేను ఎప్పుడూ క్షమించలేదు. రెండవది, అన్యాయం చేసిన వ్యక్తి నా కుటుంబ సభ్యుడైనా, నా పిల్లలైనా నేను ఎవరినీ క్షమించను.

ఎంఎస్ ధోని నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. యువరాజ్ మరో నాలుగైదేళ్లు ఆడే అవకాశం ఉంది. యువరాజ్ లాంటి కొడుకు పుట్టడం నా లక్. అలాంటి పుత్రుడినే కనాలని కోరుకుంటున్నాను. కేన్సర్‌తో ఆడి దేశానికి ప్రపంచకప్‌ను అందించినందుకు భారతరత్నతో సత్కరించాలని యోగరాజ్ డిమాండ్ చేశారు.




