మార్చి 25, 29, ఏప్రిల్ 2 న జరిగే మ్యాచ్లకు ఎలాంటి నీటి కొరత ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగుళూరు కుంబన్ పార్క్ నుండి నీటిని రీ - యుజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఒక్కో మ్యాచ్ నిర్వహణకు రోజుకి 75 వేల లీటర్ల నీరు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.