- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: KKR Bowler Harshit Rana Gives Fiery Send Off After To SRH Batter Mayank Agarwal
ఐపీఎల్ 2024: బౌండరీలతో చితకబాదిన బ్యాటర్.. కట్‌చేస్తే.. వికెట్ పడగానే ప్లేయింగ్ కిస్‌తో రెచ్చగొట్టిన బౌలర్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మూడో మ్యాచ్‌లో ముఖ్యంగా యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, మయాంక్ అగర్వాల్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వీరిద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో వీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అభిమానులు కూడా వీళ్లపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Updated on: Mar 24, 2024 | 12:16 PM

ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా, ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన మయాంక్ అగర్వాల్ ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను లక్ష్యంగా చేసుకున్న మయాంక్ సిక్స్, ఫోర్లు బాది శుభారంభాన్ని అందించాడు.

మయాంక్ అగర్వాల్ వికెట్ కోసం హర్షిక్ రానా కూడా ఎదురుచూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే రాణా వేసిన 6వ ఓవర్ మూడో బంతిని లీగ్ వైపు మయాంక్ ఆడాడు. అయితే, బౌండరీ లైన్ దగ్గర వేచి ఉన్న రింకూ సింగ్ క్యాచ్ పట్టాడు.

మయాంక్ అగర్వాల్ వికెట్ పడగానే హర్షిత్ రాణా అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన మయాంక్ అగర్వాల్ రానాను తిట్టడం మొదలుపెట్టాడు.

అలాగే, హర్షిత్ రానా వైపు చూస్తూ మయాంక్ అగర్వాల్ పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో రానా కూడా మయాంక్ కళ్లలోకి చూస్తూ పెవిలియన్ వెళ్లమంటూ సైగలు చేశాడు. దీంతో అక్కడ వాతావరణం కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.

అంటే, హైదరాబాద్‌లో రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈసారి హర్షిత్ రాణా, మయాంక్ అగర్వాల్ మధ్య పోరు మరింత ముదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు విజయాన్ని అందించడంలో హర్షిత్ రాణా సఫలమయ్యాడు. చివరి ఓవర్లో 13 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH జట్టును 204 పరుగులకు నియంత్రించడం ద్వారా హర్షిత్ రాణా 4 పరుగుల తేడాతో KKRకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.




