ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. ఈ అర్ధ సెంచరీతో కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హెన్రిక్ క్లాసెన్ ఎస్‌ఆర్‌హెచ్ తరపున తుఫాన్ బ్యాటింగ్‌ని ప్రదర్శించాడు.