- Telugu News Photo Gallery Cricket photos Washington Sundar 1st century of his test career ind vs eng 4th test at Manchester
4 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన గిల్ దోస్త్.. కెరీర్‌లో తొలి సెంచరీతో పరువు కాపాడిన సుందర్..
Washington Sundar 1st Century: మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చివరి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ. ఈ ప్రత్యేక ఇన్నింగ్స్ కోసం అతను 4 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది.
Updated on: Jul 27, 2025 | 10:57 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించి అదరగొట్టాడు. ఈ కీలకమైన శతకంతో భారత్‌కు భారీ ఊరట లభించడమే కాకుండా, మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు.

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని మాంచెస్టర్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో, రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుపై భారీ ఒత్తిడి నెలకొంది. ఈ దశలో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో పాటు, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత భాగస్వామ్యంతో భారత జట్టు పరాజయాన్ని తప్పించుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

మ్యాచ్ ఐదో రోజు ఉదయం కేఎల్ రాహుల్ (90) సెంచరీకి చేరువలో అవుట్ అవ్వగా, ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (103) కూడా సెంచరీ పూర్తి చేసుకుని నిష్క్రమించాడు. ఈ దశలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్స్ సంయమనం పాటిస్తూ, పరుగులను రాబడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీని సాధించి తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ పరువును నిలబెట్టాడు.

మ్యాచ్ డ్రాగా ముగియడంతో, ఇరు జట్లు పాయింట్లను పంచుకున్నాయి. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఇంకా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్ ఓవల్‌లో జరగనుంది. వాషింగ్టన్ సుందర్ తన తొలి టెస్టు సెంచరీతో భారత క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని ఈ ప్రదర్శన భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో అతని స్థానాన్ని పదిలం చేస్తుందని ఆశిద్దాం.

ఈ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాతో కలిసి బలమైన భాగస్వామ్యాన్ని కూడా నిర్మించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు 334 బంతులు ఆడి అజేయంగా 203 పరుగులు జోడించారు. ప్రత్యేకత ఏమిటంటే, ఇద్దరు ఆటగాళ్లు 2 సెషన్లకు పైగా బ్యాటింగ్ చేసి వికెట్లు కోల్పోలేదు. అదే సమయంలో, వాషింగ్టన్ సుందర్ సెనా దేశంలో తన తొలి టెస్ట్ సెంచరీ సాధించిన 26వ భారతీయుడు అయ్యాడు. దీంతో పాటు, భారతదేశం తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన 70వ ఆటగాడిగా కూడా నిలిచాడు .




