Yashasvi Jaiswal: భారీ రికార్డ్ సృష్టించిన యశస్వి జైస్వాల్.. రోహిత్ శర్మ స్పెషల్ లిస్టులో చోటు.. అదేంటంటే?
India vs Zimbabwe: జింబాబ్వేతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు యశస్వి జైస్వాల్ (93) తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఫలితంగా భారత జట్టు 15.2 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.