- Telugu News Photo Gallery Cricket photos Team India Odi Captain Rohit Sharma Practices With Ayush Mhatre and Sarfaraz Khan Ahead Of ODI Return Against Australia
Rohit Sharma: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తొడగొట్టిన రోహిత్.. ఆ ఇద్దరి కుర్రాళ్లతో కలిసి కుమ్మేశాడుగా..
Rohit Sharma Practices With Ayush Mhatre and Sarfaraz Khan: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు, భారత్-ఎ జట్టుతో ఆస్ట్రేలియా-ఎ జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా రోహిత్, విరాట్ కోహ్లీ ఆడతారని వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లు రోహిత్‌కు మంచి ప్రాక్టీస్ అవకాశాన్ని అందిస్తాయి.
Updated on: Sep 17, 2025 | 8:18 AM

Rohit Sharma Practices With Ayush Mhatre and Sarfaraz Khan: భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు కొంతకాలం దూరంగా ఉన్న రోహిత్, ఆసీస్‌తో సిరీస్‌కు తిరిగి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో, తన ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను మెరుగుపరుచుకోవడానికి నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు.

తాజాగా, రోహిత్ శర్మ ముంబై యువ ఆటగాళ్లు ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్‌లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో రోహిత్ తన ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాడు. యువ ఆటగాళ్లతో కలిసి సాధన చేయడం ద్వారా, తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు, వారికి కొన్ని విలువైన చిట్కాలను, మెళకువలను నేర్పిస్తున్నాడు. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్, ఆయుష్ మాత్రేకు తన బ్యాట్‌ను బహుమతిగా ఇవ్వడం విశేషం.

వచ్చే నెల అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కు చాలా కీలకం. టీ20, టెస్టుల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అందుకే, ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసి, ప్రపంచకప్ కోసం తన ఫామ్‌ను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు, భారత్-ఎ జట్టుతో ఆస్ట్రేలియా-ఎ జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా రోహిత్, విరాట్ కోహ్లీ ఆడతారని వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లు రోహిత్‌కు మంచి ప్రాక్టీస్ అవకాశాన్ని అందిస్తాయి.

ఆస్ట్రేలియాతో సిరీస్ అక్టోబర్ 19న పెర్త్‌లో ప్రారంభమై, అక్టోబర్ 23న అడిలైడ్, అక్టోబర్ 25న సిడ్నీలో జరిగే మ్యాచ్‌లతో ముగుస్తుంది. రోహిత్ శర్మ తిరిగి వన్డే జట్టులోకి అడుగుపెట్టడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




