- Telugu News Photo Gallery Cricket photos India vs South Africa 2021: Team India Wicket Keeper Rishabh Pant takes 100 test catches becoming fourth Indian to join elite club with MS Dhoni
IND vs SA: ఎలైట్ క్లబ్‌లో చేరిన భారత యువ ప్లేయర్.. ధోని, కిరణ్, కిర్మాణి తరువాత అరుదైన రికార్డు..!
Rishabh Pant: రిషబ్ పంత్ జోహన్నెస్‌బర్గ్‌లో అద్వితీయ సెంచరీ పూర్తి చేశాడు. ధోనీ-కిర్మాణీల క్లబ్‌లో చేరాడు. సెంచూరియన్ టెస్టులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కూడా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు.
Updated on: Jan 05, 2022 | 12:20 PM

భారత స్టార్ రిషబ్ పంత్ బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా వికెట్ కీపర్‌గా మాత్రం రికార్డులు సృష్టిస్తున్నాడు. సెంచూరియన్ తర్వాత, జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో అద్భుతమైన వికెట్ కీపింగ్ చేస్తూ పంత్ తన పేరును ప్రత్యేక క్లబ్‌లో కూడా చేర్చుకున్నాడు.

జోహన్నెస్‌బర్గ్ టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాగూర్ ఓవర్లో లుంగీ ఎంగిడిని క్యాచ్ పట్టి పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్‌తో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 100 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. కేవలం 27 టెస్టు మ్యాచ్‌ల్లోనే క్యాచ్‌ల సెంచరీ పూర్తి చేశాడు.

పంత్ కంటే ముందు ఎంఎస్ ధోని (256), సయ్యద్ కిర్మాణి (160), కిరణ్ మోరే (110) మాత్రమే భారత్ తరఫున వికెట్ కీపర్‌గా 100 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు తీసుకున్న క్లబ్‌లో ఉన్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 42వ వికెట్‌కీపర్‌గా నిలిచాడు.

అంతకుముందు సెంచూరియన్ టెస్టులో ఆడిన తొలి టెస్టులో రిషబ్ పంత్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వికెట్ల వెనుక వేగంగా 100 మందిని పెవిలియన్ చేర్చిన రికార్డును సృష్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ టెంబా బావుమా అతనికి 100వ టెస్టు బాధితుడయ్యాడు.




