- Telugu News Photo Gallery Cricket photos IND VS WI: team india former skipper Virat Kohli becomes the fastest player to complete 5000 ODI runs at home breaks Sachin Tendulkar record
IND VS WI: 1000వ వన్డేలో ఫ్లాప్ అయినా.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. సచిన్ కూడా వెనుకంజలోనే..
Virat Kohli Records: విరాట్ కోహ్లీ స్వదేశంలో అత్యంత వేగంగా 5000 వన్డే పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సృష్టించాడు, సచిన్ ఎన్ని ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడో తెలుసా?
Updated on: Feb 06, 2022 | 8:28 PM

Virat Kohli: విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రికార్డు బద్దలు కావడం ఖాయం. అయితే అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా అలాంటిదే జరిగింది. వెస్టిండీస్‌పై రెండో బౌండరీ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ సొంతగడ్డపై అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

విరాట్ కోహ్లీ కేవలం 96 ఇన్నింగ్స్‌ల్లోనే సొంతగడ్డపై 5000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. 121 ఇన్నింగ్స్‌లు ఆడి 5000 పరుగులు చేసిన సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అదే సమయంలో, జాక్వెస్ కలిక్ 130, రికీ పాంటింగ్ 138 ఇన్నింగ్స్‌లు ఆడారు.

సొంతగడ్డపై వన్డేల్లో 5000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ స్వదేశంలో అత్యధికంగా 6976 పరుగులు చేశాడు. పాంటింగ్ పేరుతో 5406, కలిస్ 5178 పరుగులు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ స్వదేశంలో 60.25 సగటుతో 5000 పరుగులు సాధించాడని మీకు తెలియజేద్దాం. 50 సగటుతో కూడా ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్ చేయలేకపోయాడు. సచిన్ స్వదేశంలో 48.11 సగటుతో 6976 పరుగులు చేశాడు.

అయితే అహ్మదాబాద్‌లో తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 8 పరుగులకే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాడు. అల్జారీ జోసెఫ్ వేసిన బౌన్సర్ కోహ్లీని పెవిలియన్ బాట పట్టించింది.




