- Telugu News Photo Gallery Cricket photos Csk opener Ruturaj Gaikwad and utkarsha pawar Marriage Photos goes viral
Ruturaj Gaikwad Marriage: ప్రేయసితో ఏడడుగులు నడిచిన సీఎస్‌కే ఓపెనర్.. సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్..
Ruturaj Gaikwad weds Utkarsha Pawar: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ పెళ్లాడాడు. వివాహానికి సంబంధించిన చిత్రాలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Updated on: Jun 04, 2023 | 7:37 AM

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన రీతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.

మహిళా క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను మహాబలేశ్వర్‌లో వివాహం చేసుకున్నాడు. ఉత్కర్ష మహారాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.

24 ఏళ్ల ఉత్కర్ష మీడియం పేస్ బౌలర్‌గా రాణించింది. ఆమె 2021లో లిస్ట్ ఏ క్రికెట్ ఆడింది. జూన్ 3, శనివారం వీరిద్దరూ ఏడడుగు నడిచారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఐపీఎల్ ఫైనల్‌లో ఇద్దరూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఉత్కర్ష్ మహేంద్ర సింగ్ ధోనీ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు రితురాజ్ గైక్వాడ్ భారత జట్టులో ఎంపికయ్యాడు. అయితే పెళ్లి కోసమే బ్రేక్ తీసుకున్నాడు. టీమ్ ఇండియా రిజర్వ్ జాబితాలో రితురాజ్ పేరుంది.

గైక్వాడ్ చాలా కాలంగా ఉత్కర్షతో డేటింగ్ చేస్తున్నాడు. నిన్న రాత్రి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.




