- Telugu News Photo Gallery Cricket photos Chennai Super Kings Captain MS Dhoni is not going retire from IPL CSK CEO confirms
MS Dhoni: ధోని ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ రానుందా.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్..?
IPL 2026: ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోని వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు, అతను వచ్చే సీజన్‌లో ఆడతాడా లేదా అనే దానిపై కీలక వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 06, 2025 | 7:39 AM

ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. దీనికి ముందు పెద్ద ప్రశ్న ఏమిటంటే మహేంద్ర సింగ్ ధోని IPL 2026 లో ఆడతాడా లేదా అనేది. ఈ మేరకు చెన్నై సీఈవో క్లారిటీ ఇచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ మహేంద్ర సింగ్ ధోని పదవీ విరమణ చేయడం లేదని, IPL 2026 లో ఆడతాడని ధృవీకరించారు. "ఐపీఎల్ 2026 లో ధోనిని మనం ఖచ్చితంగా చూస్తాం" అని కాశి ఈ విషయాన్ని ధృవీకరించారు.

2025 ఐపీఎల్‌లో ధోని 14 మ్యాచ్‌లు ఆడి, 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు చేశాడు. అతను 12 సిక్సర్లు, 12 ఫోర్లు కొట్టాడు.

2025 ఐపీఎల్ సీజన్ మధ్యలో ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రుతురాజ్ గాయం కారణంగా, అతను ఈ బాధ్యతను చేపట్టాల్సి వచ్చింది.

ధోనీకి ఐపీఎల్‌లో సుదీర్ఘ కెరీర్ ఉంది. అతను 2008 నుంచి ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. అతను 278 మ్యాచ్‌ల్లో 38.30 సగటుతో 5439 పరుగులు చేశాడు.




