- Telugu News Photo Gallery Cricket photos 6 Players Royal Challengers Bangalore May Buy In IPL 2024 Auction
IPL 2024: 19మంది ఆటగాళ్లతో వేలంలోకి ఆర్‌సీబీ.. ఇంకెంతమంది ప్లేయర్లు కావాలి, పర్స్ ఎంత ఖాళీగా ఉందో తెలుసా?
IPL 2024 Auction: ఆర్‌సీబీ అట్టిపెట్టుకున్న 19 మంది ఆటగాళ్లలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి RCB ఈసారి 6 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయగలదు. అంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. దీని ప్రకారం 19 మంది ఆటగాళ్లున్న RCBలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Updated on: Dec 08, 2023 | 8:09 AM

IPL 2024: IPL సీజన్ 17 మినీ వేలానికి తేదీ ఇప్పటికే నిర్ణయించారు. ఈ నెల 19న దుబాయ్‌లో వేలం ప్రక్రియ జరగనుంది. 10 టీమ్‌లు ఇప్పటికే రిటైన్, రిలీజ్ ప్రక్రియను పూర్తి చేసి ప్రస్తుతం వేలానికి సిద్ధమవుతున్నాయి.

ఆర్సీబీ జట్టు ఈసారి మొత్తం 17 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ఇద్దరు ఆటగాళ్లను కూడా ట్రేడింగ్ చేసి దక్కించుకుంది. దీని ప్రకారం మొత్తం 19 మంది ఆటగాళ్లతో ఆర్సీబీ వేలంలో కనిపించనుంది.

ఆర్‌సీబీ అట్టిపెట్టుకున్న 19 మంది ఆటగాళ్లలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి RCB ఈసారి 6 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయగలదు. అంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. దీని ప్రకారం 19 మంది ఆటగాళ్లున్న RCBలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఈ 6 స్థానాల్లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఒక జట్టులో 8 మంది విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఉంది. ఆర్‌సీబీ అట్టిపెట్టుకున్న 19 మంది ఆటగాళ్లలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, రీస్ టాప్లీ, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్ ఆర్‌సీబీ జట్టులో ఉన్నారు. దీని ప్రకారం, RCB ఈ IPL వేలం ద్వారా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

మిగిలిన మూడు స్థానాలను భారత ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. దీని ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మొత్తం 6 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

RCB జట్టు నుంచి నిష్క్రమించిన ఆటగాళ్లు: వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్.

RCB రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ , రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ (ట్రేడింగ్), మయాంక్ డాగర్ (ట్రేడింగ్).




