- Telugu News Photo Gallery Consume these pulses every day, which have special importance in Ayurveda, Moong Dal health Benefits
Health Tips: మీరు ప్రతిరోజూ ఈ పప్పును తీసుకుంటే.. ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం అస్సలు ఉండదు..
పప్పు ధాన్యాల్లో పెసరపప్పు చాలా ముఖ్యం. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచింది. ఈ పెసరపప్పు మన శరీరానికి చలువ అని చెప్ప వచ్చు. పెసరపప్పు కూడా మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ వంటి అనేక రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ పెసరపప్పుతో మనం పప్పు కూరలను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో ఉండే లాభాలను ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Aug 11, 2023 | 4:00 PM

పప్పులు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులు ప్రొటీన్ లోపాన్ని తీర్చడానికి పప్పులు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు. వీటిలో పచ్చ పెసరపప్పు కూడా ఒకటి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

పచ్చ పెసరపప్పులో అనేక పోషకాలతో పాటు జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది. పచ్చ పచ్చ పెసరపప్పులో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చ పెసరపప్పు సహాయం చేస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని.. పచ్చ పెసరపప్పు కాలేయానికి కూడా చాలా మంచిదని భావిస్తారు.

డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పచ్చ పెసరపప్పు పొట్టుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది.

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కెమికల్ సబ్బులకు ప్రత్యామ్నాయంగా పచ్చ పెసరపప్పు పొడిని ఉపయోగించవచ్చు. పచ్చ పెసరపప్పు పొడిని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.




