Healthy Bath: రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దిమ్మతిరిగే ట్విస్ట్‌ అదే..

|

Dec 02, 2024 | 1:13 PM

స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు వెల కట్టలేని మూల్యం చెల్లించుకునే చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ స్నానం చేసే వారు ఈ కింది విషయాలు తప్పక తెలుసుకోవాలి..

1 / 5
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం చన్నీటి స్నానం అంత మంచిది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉంటే చల్లటి నీటితో స్నానం చేయడం  ప్రమాదకరం. ఆరోగ్యానికి అనుగుణంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.

2 / 5
మెదడుకు రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు సాధారణంగా స్ట్రోక్ సంభవిస్తుంది. ఇలాంటప్పుడు మెదడులోని కొన్ని భాగాలకు ఆక్సిజన్ డెలివరీ ఆలస్యం అవుతుంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. సకాలంలో చికిత్స చేయకపోతే మరణానికి దారితీస్తుంది. దీన్ని సెరిబ్రల్ పాల్సీ అంటారు. కాబట్టి చల్లని నీరు సెరిబ్రల్ పాల్సీ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
తరచుగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుందట. తద్వారా దురద, చర్మంపై పగుళ్లు ఏర్పడి.. పగిలిన చర్మం ద్వారా చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాంటప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వినియోగిస్తే.. మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.

4 / 5
అంతేకాకుండా యాంటీబయాటిక్స్‌ నిరోధకత కలిగిన చెడు బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తుంది. కెమికల్ సబ్బులు చర్మాన్ని పొడిగా మారుస్తాయి. కాబట్టి అదనపు నూనెలు లేకుండా ఉండే తేలికపాటి సబ్బు, తేలికపాటి క్లెన్సర్, షవర్ జెల్ స్నానికి ఉపయోగించాలంటున్నారు నిపుణులు.

5 / 5
తడి తువ్వాళ్లు బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్, వైరస్‌లకు సంతానోత్పత్తి ప్రదేశంలా ఉటాయి. మురికిగా ఉండే టవల్ దురద, మొటిమలను కలిగిస్తుంది. దీన్ని నివారించడానికి, కనీసం వారానికి ఒకసారైనా మీ టవల్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి.