AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండ దెబ్బకు చెక్.. కొబ్బరి నీళ్లలో ఈ గింజలు వేసుకుని తాగితే అమృతమే.. ఊహించని లాభాలు..

ఉదయం ఎనిమిది దాటిందంటేనే సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, విపరీతమైన చెమట మనలోని శక్తిని నిలువునా లాగేస్తున్నాయి. కేవలం నీళ్లు తాగినా తీరని దాహం.. ఇలాంటి తరుణంలో కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చే ఎలక్ట్రోలైట్లు, శరీరాన్ని లోపలి నుండి చల్లబరిచే ఔషధం కావాలి. అదే కొబ్బరి నీరు - సబ్జా గింజల అద్భుత కలయిక. ఈ వేసవి తాపాన్ని తట్టుకుని, మీ శరీరాన్ని చల్లగా, శక్తివంతంగా ఉంచుకోవాలంటే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం

Krishna S
|

Updated on: Apr 10, 2026 | 7:34 AM

Share
భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి తీవ్రత పెరగడంతో అధిక చెమట, తీవ్రమైన అలసట, నీరసం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీరు, చలువ చేసే సబ్జా గింజల మిశ్రమంతో ఈ సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
డీహైడ్రేషన్‌కు అద్భుత పరిష్కారం: ఎండల వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్లు వేగంగా తగ్గిపోతాయి. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం, మెగ్నీషియం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటికి సబ్జా గింజలను జత చేస్తే, అవి నీటిని పీల్చుకుని జెల్ లాగా మారి, శరీరంలో ఎక్కువ సేపు తేమను నిలుపుతాయి. తద్వారా అలసట మాయమై, శరీరం రీఛార్జ్ అవుతుంది.

2 / 5
జీర్ణక్రియకు రక్షణ కవచం: వేసవిలో వచ్చే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు ఈ పానీయం ఒక దివ్యౌషధం. సబ్జా గింజల్లో ఉండే అధిక పీచుపదార్థం పేగులను శుభ్రపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీరు కడుపులోని మంటను తగ్గించి, ఎసిడిటీని నియంత్రణలో ఉంచుతుంది.

3 / 5
బరువు తగ్గాలనుకునే వారికి వరం: ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడేవారికి ఇది ఉత్తమ ఎంపిక. సబ్జా గింజలు తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి, దీనివల్ల అతిగా తినే అలవాటు తగ్గుతుంది. కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉండదు.

4 / 5
చర్మ సౌందర్యం.. రెట్టింపు శక్తి: ఈ మిశ్రమం కేవలం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. మధ్యాహ్న సమయంలో ఈ పానీయం తీసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి కూల్ డ్రింక్స్, సోడాల వంటి కృత్రిమ పానీయాల కంటే.. సహజసిద్ధమైన ఈ కొబ్బరి నీరు-సబ్జా గింజల మిశ్రమాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ వేసవిని ఆరోగ్యంగా ఎదుర్కోవచ్చు.

5 / 5
Follow Us