
మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఏంటో తెలుసా..? ఎందుకు తెలియదు ఇప్పుడు మన టాలీవుడ్‌ను చూపిస్తే సరిపోతుంది కదా..! అవునా.. ఎందుకలా అంటున్నారు అనుకుంటున్నారు కదా..? ఎందుకు అనుకోము చెప్పండి..? ఆల్రెడీ ఎన్నికల వేడిలో సమ్మర్ అంతా సల్లారిపోయింది. ఇప్పుడు తగదునమ్మా అంటూ మరో పిడుగు టాలీవుడ్ నెత్తిన పడింది.

సంక్రాంతి ఇచ్చిన స్టార్ట్‌ను ఫిబ్రవరి పూర్తిగా నీరు గార్చేసింది. లెక్కల్లో చెప్పుకోడానికి పాతిక సినిమాలు విడుదలయ్యాయి కానీ అందులో ఒక్కటి కూడా బ్లాక్‌బస్టర్ కాలేదు. యావరేజ్ దగ్గరే ఆగిపోయి.. ఇండస్ట్రీని మరింత బ్యాడ్ ఫేజ్‌లోకి తోసేసాయి. పోనీలే మార్చి, ఎప్రిల్ ఉందిగా అనుకుంటే.. ఎన్నికలకు తోడు ఇప్పుడు IPL సీజన్ నిర్మాతలను వణికిస్తుంది.

మార్చిలో ఆపరేషన్ వాలంటైన్, భీమా, గామి లాంటి సినిమాలు వచ్చాయి. కానీ వచ్చాయంతే. ఈ నెల 15న విడుదలైన రజాకార్ బ్లాక్ బస్టర్ అయింది. మార్చ్ 22న ఓం భీం బుష్ అనే కామెడి ఎంటర్టైనర్ రానుంది. మార్చ్ చివరి వారంలో రొమాంటిక్ థ్రిల్లర్ టిల్లు స్క్వేర్ రానుంది.

మార్చి 22 నుంచి సినిమాలకు అతిపెద్ద సవాల్ ఐపిఎల్ న్యూ సీజన్. అలాగే ఎప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. కానీ సవాళ్లు కూడా అలాగే ఉన్నాయి. వీటిని దాటి ఇది ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.

టాలీవుడ్‌కు ఆల్రెడీ నడుస్తున్న బ్యాడ్ టైమ్ సరిపోదన్నట్లు.. ఇప్పుడు ఐపిఎల్ గండం కూడా తోడవ్వడంతో కష్టాలు డబుల్ అయ్యాయి. పైగా ఎన్నికల సీజన్ కోసమే సమ్మర్ సీజన్ అంతా త్యాగం చేసారు మన హీరోలు. దేవర వాయిదాకు ప్రధాన కారణాల్లో ఎన్నికలు కూడా ఓ కారణమే. అయితే ఉన్న ఒక్క సినిమా ప్రభాస్ కల్కి. ఇది కూడా పోస్టుపోన్ అయ్యేలనే కనిపిస్తుంది.