Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్ సేన్ ?? అసలు ఏం జరిగిందంటే ??
విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కుంటున్నారా.. సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడూ కాంట్రవర్సీలతోనే పాపులర్ అవుతుంటారు ఈ హీరో. తాజాగా కల్ట్ టైటిల్ ప్రకటించి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ కల్ట్ నాదంటే నాదంటూ విశ్వక్ సేన్‌తో పాటు ఆ నిర్మాత కూడా పోటీ పడుతున్నారా..? అసలేం జరుగుతుంది..? ఈ కల్ట్ బొమ్మ ఎవరిదసలు..? 2023లో కల్ట్ అనే పదం బాగా ఫేమస్ అయిపోయింది. అందుకే స్కందలో బోయపాటి ఏకంగా ఓ పాట ఈ పదంపై పెట్టేసారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 02, 2024 | 2:43 PM

విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కుంటున్నారా.. సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడూ కాంట్రవర్సీలతోనే పాపులర్ అవుతుంటారు ఈ హీరో. తాజాగా కల్ట్ టైటిల్ ప్రకటించి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ కల్ట్ నాదంటే నాదంటూ విశ్వక్ సేన్‌తో పాటు ఆ నిర్మాత కూడా పోటీ పడుతున్నారా..? అసలేం జరుగుతుంది..? ఈ కల్ట్ బొమ్మ ఎవరిదసలు..?

2023లో కల్ట్ అనే పదం బాగా ఫేమస్ అయిపోయింది. అందుకే స్కందలో బోయపాటి ఏకంగా ఓ పాట ఈ పదంపై పెట్టేసారు. దానికంటే ముందే నేను కల్ట్ బొమ్మ తీసానంటూ బేబీ సినిమా టైమ్‌లో నిర్మాత SKN చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు.. కల్ట్ బొమ్మ టైటిల్‌ను రిజిష్టర్ కూడా చేయించారు SKN.

కల్ట్ బొమ్మ టైటిల్ గురించి SKN ముందుగానే ప్రకటించారు. త్వరలోనే అందులో ఎవరు నటిస్తారో చెప్తానని కూడా తెలిపారీయన. అయితే తాజాగా కల్ట్ పేరుతో విశ్వక్ సేన్ కూడా తను నిర్మాతగా ఓ సినిమాను ప్రకటించారు. దానికి కథ అందిస్తుంది ఆయనే. తాజూద్దీన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది.

కల్ట్ అనే టైటిల్ తానే రిజిష్ట్రేషన్ చేసుకున్నానని.. అక్కడ ఏ టైటిల్ లేదన్నారు విశ్వక్. మరోవైపు SKN మాత్రం తాను కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిష్టర్ చేయించానంటున్నారు.

నిజానికి బేబీ మేకర్స్, విశ్వక్ సేన్ మధ్య గ్యాప్ చాలా రోజుల నుంచి కనిపిస్తుంది. తాజాగా కల్ట్, కల్ట్ బొమ్మ టైటిల్స్‌తో అది నెక్ట్స్ లెవల్‌కు వెళ్లేలా కనిపిస్తుంది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి.





























