ప్రమోషన్ చేసుకోవడం మొదలుపెడితే.. నాకంటే బాగా ఎవడూ చేసుకోలేడు అంటున్నారు విజయ్ దేవరకొండ. మీరు ట్రోల్ చేసినా.. కామెడీ చేసినా.. ఇరిటేట్ చేసినా.. అన్నింటినీ ప్రమోషన్‌లో ఇరికించేస్తా అంటున్నారు రౌడీ బాయ్. తాజాగా ఫ్యామిలీ స్టార్‌కు ఇదే చేస్తున్నారీయన. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను తన సినిమా ప్రమోషన్ కోసం వాడేసారు. ఇంతకీ ఏంటా ట్రోలింగ్..?