- Telugu News Photo Gallery Cinema photos Urvashi Rautela Birthday Celebrations at Pakistan vs India Match Cricket Stadium in dubai
ఉత్కంఠగా పాకిస్థాన్, ఇండియా మ్యాచ్.. ఊర్వశీ రౌతేలకు ఊహించని సర్ప్రైజ్
బాలయ్య బ్యూటీ ఊర్వశీ రౌతేల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్‌గా బాలకృష్ణ డాకు మాహారాజ్ సినిమాలో దబిడి దిబిడే అంటూ ఐటమ్ సాంగ్ చేసి తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది. ఇక ఆ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఏంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ దుబాయ్‌లో ప్రత్యేక్షమై అందరినీ ఆశ్చర్య పరిచింది.
Updated on: Feb 24, 2025 | 1:50 PM

దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, భారత్ , పాకిస్థాన్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇండియా టీం ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి చాలా మంది తెలుగు యాక్టర్స్ దుబాయ్ చేరుకొని లైవ్‌లో పాక్, ఇండియా మ్యాచ్ చూస్తూ ఏంజాయ్ చేశారు.

ఈ క్రమంలోనే అందాల భామ ఊర్వశి రౌతేల కూడా ఈ మ్యాచ్‌లో మరింత స్పెషల్‌గా కనిపించింది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది ఏమిటంటే? ఈ ముద్దుగుమ్మకు ఓ మహిళ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.

అసలు విషయంలోకి వెళితే.. ఊర్వశీ రౌతేల పుట్టిన రోజు ఫిబ్రవరి 25. కానీ తన పుట్టిన రోజుకు రెండు రోజుల సమయం ఉండగానే, దుబాయ్ క్రికేట్ స్టేడియంలో అక్కడి సిబ్బంది ఈ బ్యూటీకి కేక్ తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఈ ముద్దుగుమ్మ అటు పాకిస్తాన్ జనాలు క్రికేటర్స్, ఇటు ఇండియా క్రికేటర్స్, ప్రేక్షకుల మధ్య తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది.

అంతేకాకుండా, ఇలా క్రికేట్ ప్రేమికుల ముందు పుట్టిన రోజు జరుపుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డ్స్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ క్రికేట్ మ్యాచ్ చూడటానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేష్, సుకుమార్ కూడా దుబాయ్ వెళ్లారు.