- Telugu News Photo Gallery Cinema photos Upcoming Movies in Summer 2024 in Tollywood Telugu Entertainment Photos
Summer 2024 Movies: రానున్న సమ్మర్ మరింత హీట్.. బరిలో బడా హీరోస్..
పుష్ప 2 కూడా సమ్మర్ రేసులోనే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది.. 2023లోనే దీన్ని తీసుకురావాలనుకున్నా.. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు కారణంగా కుదర్లేదు. 2024 సమ్మర్‌లోనే దీన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు సుక్కు. ఇదే సీజన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రానుంది. ఒక్కసారి ఊహించుకోండి.. పవన్, ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్.. అంతా ఒకేసారి వస్తే సీన్ ఎలా ఉంటుందో..?
Updated on: Aug 24, 2023 | 8:14 PM

అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో..? మగధీర సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా అందరికీ..! ఎందుకంటే ఇండస్ట్రీలో జరుగుతున్న ఓ సిచ్యువేషన్‌కు ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుంది. 2024 సమ్మర్‌లో 4 పాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి. అయితే అవి వచ్చే వరకు అనుమానమే.. కానీ వస్తే బాగుండని ఫ్యాన్స్ ఆశ. ఇంతకీ ఏంటా నాలుగు సినిమాలు..? అవి నిజంగా వస్తాయా..?

తెలుగు సినిమా రేంజ్ పెరిగిన తర్వాత.. మన దర్శకులు క్వాలిటీ పేరుతో మేకింగ్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. దాంతో ఏ సినిమా ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టంగానే మారిపోయింది. ఈ క్రమంలోనే 2023లోనే వస్తాయనుకున్న ప్రాజెక్ట్ K, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర లాంటి సినిమాలెన్నో 2024కి పోస్ట్ పోన్ అయ్యాయి. ఇవన్నీ ఒకే సీజన్‌లో వస్తాయనే ప్రచారం మొదలైంది.. అదే జరిగితే బాక్సాఫీస్‌కు ఊచకోతే.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎప్రిల్ 5, 2024న విడుదల కానుంది దేవర.ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా సమ్మర్ రేసులోనే ఉంది.

ఇక సంక్రాంతికి వస్తుందనుకున్న ప్రభాస్ ప్రాజెక్ట్ K కూడా సమ్మర్‌కు రానుందని తెలుస్తుంది. CG వర్క్స్ కారణంగా.. ఇండియన్ 2 ఇప్పట్లో అయ్యేలా లేకపోవడంతో ఫుల్ ఫోకస్ చరణ్ సినిమాపై పెట్టేసారు శంకర్.