Trisha-Nayanthara: ఆ స్టార్ హీరో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్న త్రిష, నయనతార.. ఫ్యాన్స్‌కు పండగే
ఆ హీరోయిన్లు ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో ఏవో కొన్ని డిఫరెన్సులు ఉండేవి. ఆ తర్వాత ఇద్దరు ఎక్కడ కలిసినా బాగానే మాట్లాడుకునేవారు. ఒకే సినిమాలో కలిసి పనిచేయాల్సిన సందర్భాలను కూడా మిస్ చేసుకున్నారు. అప్పుడు మిస్ అయిన ఓ అకేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందని అంటోంది కోలీవుడ్. తమిళనాడులో ఇద్దరు హీరోయిన్లు అనగానే, గెస్ చేయడం మొదలుపెట్టేశారు కదా.. యస్.. మీ ఇమేజినేషన్‌లో ఉన్నది కూడా త్రిష అండ్ నయనేనా?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Basha Shek
Updated on: Jul 18, 2023 | 8:28 PM

ఆ హీరోయిన్లు ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో ఏవో కొన్ని డిఫరెన్సులు ఉండేవి. ఆ తర్వాత ఇద్దరు ఎక్కడ కలిసినా బాగానే మాట్లాడుకునేవారు. ఒకే సినిమాలో కలిసి పనిచేయాల్సిన సందర్భాలను కూడా మిస్ చేసుకున్నారు. అప్పుడు మిస్ అయిన ఓ అకేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందని అంటోంది కోలీవుడ్. తమిళనాడులో ఇద్దరు హీరోయిన్లు అనగానే, గెస్ చేయడం మొదలుపెట్టేశారు కదా.. యస్.. మీ ఇమేజినేషన్‌లో ఉన్నది కూడా త్రిష అండ్ నయనేనా?

త్రిష జోరు మామూలుగా లేదిప్పుడు. ఇంకెక్కడ త్రిష కెరీర్.. అయిపోయింది అని జనాలందరూ పక్కాగా ఫిక్స్ అయిన టైమ్‌లో బౌన్స్ బ్యాక్ అయ్యారు త్రిష. అసలు ఆ గ్రేస్ ఏంటి? రీ ఎంట్రీలో ఆ చరిష్మా ఏంటి? ఆ మేకోవర్ ఏంటి? అంటూ అందరూ ముక్కునవేలేసుకున్నారు. అంతగా తనను తాను ప్రెజెంట్ చేసుకున్నారు మిస్ కుందవై.

అటు నయనతార రేంజ్ కూడా బాలీవుడ్‌ని టచ్ చేస్తోంది. పెళ్లయ్యాక హీరోయిన్‌కి కెరీర్ స్లో అవుతుందనే మాటలు ఎప్పుడో చెల్లిపోయాయి. అందుకే ఆఫ్టర్ మేరేజ్ కూడా చెలరేగిపోతున్నారు మేడమ్ నయన్. తలైవి అంటూ తమిళ ఆడియన్స్ తో క్యూట్‌గా పిలిపించుకుంటున్న ఈ లేడీ సూపర్‌స్టార్ చేతిలో చాలా సినిమాలున్నాయి.

మణిరత్నం డైరక్షన్‌లో నయనతార మూవీ చేస్తారనే న్యూస్ వైరల్ అయింది. నాయకుడు తర్వాత కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీలోనే నయన్‌ని నాయికగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. నాయకుడు తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, ఆ సినిమాను మించేలా ఈ తాజా ప్రాజెక్ట్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు మణిరత్నం.

మణిరత్నం డైరక్షన్‌లో త్రిష మళ్లీ సినిమా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. దీన్నిబట్టి కమల్ మూవీలో త్రిష కూడా ఉంటారని గెస్ చేస్తోంది కోలీవుడ్ మీడియా. ఆల్రెడీ కన్మనీ రాంబో ఖతీజాలో కలిసి చేయాల్సింది నయన్ అండ్ త్రిష. అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు సెట్ అవుతోందని అంటున్నారు క్రిటిక్స్. మణి సెట్లో... షూటింగ్‌లో హీరోయిన్లు ఇద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంటుందో చూడాలన్నది చాలా మందికున్న కోరిక.