60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస్!
టాలీవుడ్ సీనియర్స్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. సినిమాలతో సంబంధం లేకుండా పర్ఫెక్ట్‌గా మేకోవర్ అవుతున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టైలింగ్‌తో కుర్ర హీరోలకు పోటి ఇస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య ప్రతీ ఒక్కరు ఇప్పుడు యంగ్ అండ్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.
Updated on: Jan 16, 2025 | 7:34 PM

టాలీవుడ్ సీనియర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కుర్ర హీరోలతో పోటి పడాలంటే మనం కూడా ఏజ్ తగ్గించుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అందుకే అప్ కమింగ్ సినిమాల కోసం అదిరిపోయే రేంజ్‌లో మేకోవర్ అవుతున్నారు.

సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు అభిమానులను ఫుల్ ఖుషీ చేశాయి. ఈ లుక్స్ చూశాక విశ్వంభర కంటెంట్ మీద మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

కింగ్ నాగార్జున కూడా మేకోవర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అసలే మన్మథుడు ఇమేజ్ ఉన్న హీరో కావటంతో ఇప్పటికీ అదే రేంజ్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సెల్రబేషన్స్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో నాగ్ లుక్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం అంటూ థియేటర్లలో సందడి చేస్తున్న వెంకీలో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో కనిపించిన విక్టరీ హీరో, గతంలో కంటే ఎనర్జిటిక్‌గా కనిపించారు. సినిమాలో యంగ్ లుక్‌లో రొమాంటిక్ హీరోగానూ కన్విన్స్ చేశారు.

ఎవర్ యంగ్ బాలయ్య అయితే వెండితెరను షేక్ చేస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న నందమూరి నటసింహా... లుక్స్, మేకోవర్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా... ఎనర్జీ విషయంలో ఎప్పుడు ఫుల్ హైలో కనిపిస్తున్నారు. ఇలా సీనియర్స్ అంతా సూపర్ ఫామ్‌లో ఉండటంతో అభిమానులు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు.