
చాలా రోజులుగా సినిమాల వాయిదా వార్తలతో అభిమానులను ఇబ్బంది పెట్టిన పవన్, ఇప్పుడు రూటు మార్చారు. ఏకంగా మూడు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ నెల 24న హరి హర వీరమల్లుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాల కోసం పవన్ అభిమానులే కాదు... ఆ సినిమాల హీరోయిన్లు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. చాలా ఏళ్లుగా కెరీర్‌లో బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నిధి, ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ఎంత లేట్ అయిన ఓపిగ్గా సినిమా కోసం వర్క్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

హరి హర వీరమల్లు తరువాత రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమా ఓజీ. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ హిట్ లేని ప్రియాంక.. ఓజీతో ఆ కల నెరుతుందని ఆశపడుతున్నారు.

పవన్ లైనప్‌లో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రజెంట్ మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ... స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే టాప్ స్టార్స్‌కు జోడీగా కనిపించాలి. ఇప్పటికే గుంటూరు కారంలో మహేష్‌కు జోడీగా నటించిన శ్రీలీల.. ఇప్పుడు పవన్ సినిమాతో టాప్ లీగ్‌లో ప్లేస్ దక్కుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.