- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes ready to make films with new combination Telugu Entertainment Photos
Tollywood: సరికొత్త కాంబినేషన్లు సెట్ అవుతాయా..? టాలీవుడ్ లో కొత్త కొత్త ప్లాన్లు..
సరికొత్త కాంబినేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చిరు - అనిల్ రావిపూడి, బాలయ్య - ప్రశాంత్ వర్మ, ప్రభాస్ - హను రాఘవపూడి, నాగచైతన్య - రామ్ అబ్బరాజు... ఇలా కొత్త కాంబినేషన్ల మీద సీరియస్‌గానే ఆశలు పెంచుకుంటున్నారు. అసలు సాధ్యాసాధ్యాలేంటి? ప్రస్తుతం భోళా శంకర్ ఫైనల్ పనుల్లో ఉన్నారు మెగాస్టార్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే సినిమాల మీద కూడా క్లారిటీ ఉంది.
Updated on: Jul 31, 2023 | 2:00 PM

సరికొత్త కాంబినేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చిరు - అనిల్ రావిపూడి, బాలయ్య - ప్రశాంత్ వర్మ, ప్రభాస్ - హను రాఘవపూడి, నాగచైతన్య - రామ్ అబ్బరాజు... ఇలా కొత్త కాంబినేషన్ల మీద సీరియస్‌గానే ఆశలు పెంచుకుంటున్నారు. అసలు సాధ్యాసాధ్యాలేంటి?

ప్రస్తుతం భోళా శంకర్ ఫైనల్ పనుల్లో ఉన్నారు మెగాస్టార్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే సినిమాల మీద కూడా క్లారిటీ ఉంది. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరదా సరదాగా సాగే కథకు ఓకే చెప్పారన్నది ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతున్న న్యూస్. అదే నిజమైతే లైటర్ వెయిన్ మూవీ చిరు వికీపీడియాలో త్వరలోనే యాడ్ అవుతుందని సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్.

తెలుగులో మాంఛి డైలాగులు చెప్పగల నటులను గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు చెప్పుకునే పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన్ని పౌరాణిక సినిమాలో చూడాలన్నది ప్రేక్షకుల కోరిక. ఇప్పుడు హనుమాన్ సినిమా చేస్తున్న ప్రశాంత్ వర్మ అలాంటి ఎటెంప్ట్ చేస్తారా? అనే ఎదురుచూపులున్నాయి. బాలయ్య హీరోగా ప్రశాంత్ వర్మతో సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ ఎప్పుడు ఏ జోనర్ నుంచి ఏ జోనర్‌లోకి షిఫ్ట్ అవుతారో అంత తేలిగ్గా ఎవరూ చెప్పలేరు. వరుసగా భారీ సినిమాలతో బిజీ అయిన డార్లింగ్, త్వరలోనే ఓ మాంఛి హార్ట్ టచింగ్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. అందుకే, ఇటీవల సీతారామమ్‌తో బ్రీజీ ఎంటర్‌టైనర్ ఇచ్చిన హను రాఘవపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాగచైతన్య కూడా మెగాస్టార్ రూట్లో ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇటీవల సామజవరగమన సినిమాతో ప్రేక్షకులను అలరించిన డైరక్టర్ రామ్ అబ్బరాజుతో సినిమా చేయడానికి రెడీ అన్నారన్నది వైరల్ అవుతున్న వార్త. ప్రచారంలో ఉన్న ఈ కాంబినేషన్లు స్క్రీన్ మీదకు వస్తే ఫ్రెష్ ఫ్లేవర్ ఖాయం అంటున్నారు మూవీ లవర్స్.





























