మా ఫ్యాన్స్ కోసమైనా ఒక్క హిట్ కావాలంటున్న హీరోలు.. ఎవరంటే ??

Edited By:

Updated on: May 16, 2025 | 9:36 PM

అభిమాన హీరో ఫ్లాప్‌ ఇస్తే.. నెట్టింట్లో మిగిలిన హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోవడం మామూలు విషయం కాదు.. ఓ వైపు ఫ్లాప్‌ ఇచ్చినా, మన హీరోని వదులుకోలేం.. మరోవైపు అవతలివాళ్ల కామెంట్స్ ని తట్టుకోలేం.. ఆ బాధ ఎవరికీ రాకూడదబ్బా అని మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్. ఇంతకీ ఎవరా సీనియర్స్..

1 / 5
రెట్రో విజయయాత్ర ఇప్పుడే మొదలైంది. అందరికీ ధన్యవాదాలు అని పోస్టుపెట్టారు డైరక్టర్‌ కార్తిక్‌ సుబ్బరాజ్‌. కానీ, సినిమా అనుకున్నంత ఎక్కడ ఆడింది భయ్యా అంటూ నెట్టింట్లో కామెంట్లు కనిపిస్తున్నాయి.

2 / 5
ఆ ప్రయోగాలేంటి? ఆ స్క్రిప్ట్ సెలక్షన్‌ ఏంటి? పక్కా కమర్షియల్‌ సినిమా చేయొచ్చు కదా.. అని సూర్యకి సలహాలిచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయనకే  కాదు, విక్రమ్‌కి కూడా ఇలాంటి సజెషన్స్ మెండుగా వస్తున్నాయి.

3 / 5
వీరధీరశూరన్‌ పార్ట్ 2 బాగానే ఉందనే మాట కోలీవుడ్‌లో వినిపించినా, మనవాళ్లు మాత్రం అబ్బే.. ఏం ఉంది అందులో అని పెదవి విరిచేశారు. అంతకు ముందు చేసిన తంగలాన్‌ మాత్రమే కాదు, ప్రీవియస్‌ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. తమిళనాడులో విక్రమ్‌కీ, మన రవితేజకీ కంపేర్‌ చేస్తున్నారు చాలా మంది.

4 / 5
ఇప్పుడు చేస్తున్న మాస్‌ జాతర రవితేజ కంపల్సరీగా హిట్‌  కావాల్సిందే. మాస్‌ మహరాజ్‌ కెరీర్‌ ఊపందుకుందనుకున్న టైమ్‌లో మళ్లీ ఊబిలో పడ్డట్టయింది. వరుస ఫ్లాప్‌లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన హోప్స్ అన్నీ మాస్‌ జాతర మీదే ఉన్నాయి.

5 / 5
సీనియర్‌ హీరో నాగార్జున కూడా సోలోగా చాలా కాలమైంది హిట్‌ చూసి. ఇప్పుడు రజనీకాంత్‌తో నటిస్తున్న కూలీ, ధనుష్‌ తో చేస్తున్న కుబేరమీద ఆశలు పెట్టుకున్నారు. అయినా, తమ సీనియర్‌ ఓ మంచి హిట్‌ ఇస్తే కాలర్‌ ఎగరేయాలని ఎదురుచూస్తున్నారు అక్కినేని అభిమానులు.