- Telugu News Photo Gallery Cinema photos Tollywood and bollywood heroines like kiara advani nayanthara samantha doing glamour show even after marriage
ఇంటిపేరు మారినా.. అందాల ఆరబోత మాత్రం మారదు.. కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తున్న సీనియర్ ముద్దుగుమ్మలు
పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు.
Updated on: May 28, 2025 | 1:20 PM

పెళ్లైన హీరోయిన్లను ఒకప్పుడు అక్క, వదిన పాత్రలతో సరిపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. పెళ్లి తర్వాతే వాళ్ల డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ అదే ట్రెండ్ ఇప్పుడు.

నయనతార, అలియా భట్, కత్రినా, దీపిక, కియారా, రకుల్.. ఇలా పెళ్లైన ముద్దుగుమ్మలంతా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారిప్పుడు.నయనతారనే తీసుకోండి.. పెళ్లి తర్వాత ఈమె రేంజ్ ఇంకాస్త పెరిగింది.

ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా తీసుకుంటున్న నయన్.. ప్రస్తుతం తెలుగులో చిరు, అనిల్ సినిమాలో నటిస్తున్నారు. కాజల్ కూడా వరస అవకాశాలు అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత దూకుడు మామూలుగా లేదు.

కియారా అద్వానీ మొన్న వార్ 2 టీజర్‌లో 3 సెకన్లతోనే సంచలనం రేపారు.బాలీవుడ్‌లోనూ శ్రీమతుల హవానే నడుస్తుంది. అక్కడ కత్రినా కైఫ్, అలియా భట్, దీపిక పదుకొనే లాంటి మ్యారీడ్ హీరోయిన్లే రూల్ చేస్తున్నారు.

వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తామనట్లేదు.. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. వీళ్ళ ధాటికి.. కుర్ర హీరోయిన్లు కూడా చేతులెత్తేస్తున్నారు. అలా ఉంది పెళ్లైన భామల దూకుడు.




