'కిల్' చూసిన వారెవరూ షాక్ అవుతున్నారు. ఇది భారతదేశపు అత్యంత హింసాత్మక చిత్రంగా అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ స్పేస్‌లో రూపొందించిన ప్రత్యేకమైన సినిమా ఇది. ఇంతకు ముందు ఇండియాలో చేసిన ఇలాంటి సినిమాలేవీ ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కిల్ సినిమా రూ.45 కోట్ల బిజినెస్ చేసింది. లక్ష్య లాల్వానీ , రాఘవ్ జుయాల్ నటన ఆడియన్స్ ను ఆకర్షించింది.