Senior Directors: ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?

| Edited By: Prudvi Battula

Sep 07, 2024 | 3:02 PM

రీ రిలీజ్ సినిమాలకు హీరోలకు ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయో తెలియదు కానీ.. సీనియర్ దర్శకులకు మాత్రం బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఆల్‌మోస్ట్ అందరూ మరిచిపోతున్న టైమ్‌లో.. వాళ్ల పాత సినిమాలని రీ రిలీజ్ చేస్తూ.. ఈ జనరేషన్ ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు నాటి దర్శకులు. మరి రీ రిలీజ్‌లతో ట్రెండ్ అవుతున్న ఆ దర్శకులెవరో తెలుసా..?

1 / 5
బి గోపాల్, కృష్ణవంశీ, గుణశేఖర్.. వీళ్ళంతా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన దర్శకులు. వాళ్ల నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అదో బ్రాండ్. అలాంటి దర్శకులు ఇప్పుడు కనిపించట్లేదు.

2 / 5
జనరేషన్ గ్యాపో ఏమో కానీ ఈ తరం ఆడియన్స్‌ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ సీనియర్స్ అంతా. కానీ వాళ్ళకు రీ రిలీజ్‌లే ఊరటనిస్తున్నాయిప్పుడు. ఈ విషయం గురించి ఇప్పుడు చూద్దాం.. 

3 / 5
కృష్ణవంశీ గురించి ఈ జనరేషన్ ఆడియన్స్‌కు పరిచయం లేదు. కానీ ఒకప్పుడు ఈయన్ని క్రియేటివ్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకునే వాళ్లు ఫ్యాన్స్. మొన్న మురారితో ట్రెండ్ అయిన వంశీ.. తాజాగా అక్టోబర్ 2న ఖడ్గం రీ రిలీజ్‌తో మరోసారి పలకరించబోతున్నారు. గతేడాది రంగమార్తాండతో ప్రశంసల దగ్గరే ఆగిన కృష్ణవంశీ.. కమర్షియల్ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

4 / 5
2002లో విడుదలైన ఖడ్గం అప్పట్లో సంచలనం. గాంధీజయంతి కానుకగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. నరసింహనాయుడు, ఇంద్ర రీ రిలీజ్‌లతో ఈ తరానికి పరిచయమయ్యారు బి గోపాల్.

5 / 5
ఒక్కడుతో గుణశేఖర్, ఆదితో వినాయక్ ఆ మధ్య ట్రెండ్ అయ్యారు. రీసెంట్‌గా గబ్బర్ సింగ్‌తో హరీష్ శంకర్ పేరు మార్మోగిపోయింది. మొత్తానికి అలా సరిపెట్టుకుంటున్నారు మన సీనియర్స్.