మన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడెక్కడుంది? జైలర్ తో నువ్ కావాలయ్యా అంటూ తెగ సందడి చేసిన తమన్నా తర్వాత ఏం చేస్తుంది? అనేది ఆమె ఫ్యాన్స్ సందేహం. కానీ ఈ అమ్మడు మాత్రం రెక్కలు కట్టుకొని మాల్దీవులకు ఎగిరిపోయింది. అయితే తాను ఒక్కతే వెళ్లిందా? పక్కన ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా మరో వ్యక్తి ఉన్నాడనేది తమన్నా తన ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలను బట్టి అర్థమవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు నటుడు విజయ్ వర్మ.