తమిళంలో విడుదలైన వినోదాయసిత్తం మూవీకి రిమేక్ గా సముద్రఖని బ్రో చిత్రానికి దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు రాయడం విశేషం. సినిమా విడుదలయ్యాక శ్యాంబాబు పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నాయకులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏకంగా మేం కూడా సినిమాలు తీస్తామనే సవాళ్ల దాకా వెళ్లింది.