Jawan: జవాన్ ట్రైలర్ సూపర్బ్.. ఈసారి ‘పఠాన్’.. అంతకుమించి..
జవాన్ సినిమా గురించి నిన్నటి వరకు ఉన్న ఊహాగానాలకు ఇవాళ ఫుల్‌స్టాప్ పడింది. చాలా విషయాలకు ట్రైలర్‌లో క్లారిటీ ఇచ్చేశారు అట్లీ. ఫట్ ఫట్ మంటూ మారే షాట్లూ, ప్రతి షాట్‌లోనూ ఏదో విషయాన్ని కన్వే చేసిన తీరు, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్... ప్రతిదీ అట్రాక్ట్ చేసింది. పఠాన్ మేనియాని జవాన్ కంటిన్యూ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ట్రైలర్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 02, 2023 | 12:56 PM

జవాన్ సినిమా గురించి నిన్నటి వరకు ఉన్న ఊహాగానాలకు ఇవాళ ఫుల్‌స్టాప్ పడింది. చాలా విషయాలకు ట్రైలర్‌లో క్లారిటీ ఇచ్చేశారు అట్లీ. ఫట్ ఫట్ మంటూ మారే షాట్లూ, ప్రతి షాట్‌లోనూ ఏదో విషయాన్ని కన్వే చేసిన తీరు, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్... ప్రతిదీ అట్రాక్ట్ చేసింది. పఠాన్ మేనియాని జవాన్ కంటిన్యూ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ట్రైలర్.

అనగనగా ఒకరాజు, ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో, ఆకలితో అడవిలో తిరుగుతున్నాడంటూ డైలాగ్‌తో మొదలైన జవాన్ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అతను చాలా కోపంగా ఉన్నాడంటూ షారుఖ్‌ని చూపించిన విధానం బావుంది. బాల్డ్ హెడ్ షారుఖ్ షాట్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.

నీకు కావాల్సింది ఏంటో చెప్పు అని ఫోన్‌లో అడిగినప్పుడు, ఆలియాభట్ అని షారుఖ్ చెప్పడం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తోంది. జవాన్ సినిమాలో షారుఖ్ ఒక కేరక్టర్ చేస్తున్నారా? డ్యూయల్ రోల్ చేస్తున్నారా?... నిన్నటివరకు ఇదో సమాధానం లేని ప్రశ్న. కానీ ఇవాళ ట్రైలర్‌లో దానికి ఆన్సర్ వచ్చేసింది. నా కొడుకును టచ్ చేయడానికి ముందు అని షారుఖ్ వాయిస్ వినిపించగానే, ఇక్కడ ఆడియన్స్ ఆన్సర్‌తో కనెక్ట్ అయిపోయారు.

దేశాన్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదించాలనుకునే విలన్, అతనికే విలన్‌గా మారాల్సిన పరిస్థితులను ఫేస్ చేసిన జవాన్ ... చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథనే తెరకెక్కించారు అట్లీ. దీపిక జస్ట్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారనుకున్నవారికి కూడా ట్రైలర్‌తో ఆన్సర్ వచ్చేసింది. దీపిక ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు.

నయన్‌కి నార్త్ లో హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ సేతుపతి లుక్స్ కి ఫిదా అవుతున్నారు. ఐదు గెటప్పుల్లో కనిపించారు షారుఖ్. ఈ ఏడాది ఆల్రెడీ పఠాన్‌తో వెయ్యి కోట్ల మార్కును దాటిన షారుఖ్‌కి, జవాన్ కూడా అంతకు మించిన సక్సెస్ ఇస్తుందంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు ఫ్యాన్స్. ట్రైలర్‌ని మించి సినిమా ఉంటుందా? తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.