- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Birthday Special Rare Photos goes viral telugu cinema news
Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ అరుదైన ఫోటోస్ ఎప్పుడైనా చూశారా ?..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు పవన్ అరుదైన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న పవన్ అరుదైన ఫోటోస్ ఎంటో తెలుసుకుందామా. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ సినీరంగ ప్రవేశం చేసి గోకులంలో సీత అంటూ ప్రేక్షకులను అలరించాడు పవన్. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. ఆ వెంటనే బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు.
Updated on: Sep 02, 2023 | 12:37 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు పవన్ అరుదైన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న పవన్ అరుదైన ఫోటోస్ ఎంటో తెలుసుకుందామా.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ సినీరంగ ప్రవేశం చేసి గోకులంలో సీత అంటూ ప్రేక్షకులను అలరించాడు పవన్. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. ఆ వెంటనే బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన నటన, టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పవన్. కళ్యాణ్ బాబు అంటే అన్నయ్య చిరంజీవికి ఎంతో ఇష్టం. తాజాగా శనివారం పవన్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసారు మెగాస్టార్.

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బాబాయ్ అంటే ఎంతో ఇష్టం. చరణ్, పవన్ స్నేహితుల్లా ఉండేవారమని గతంలో కళ్యాణ్ బాబు తెలిపారు. వీరిద్దరు కలిసిన అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పవన్. సినీపరిశ్రమలోని స్టార్స్ అందరితో కళ్యాణ్ బాబుకు మంచి అనుబంధం ఉంది. అక్కినేని నాగార్జున, పవన్, మహేష్ బాబు, సుమంత్ కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరలవుతుంది.





























