Rashmika Mandanna: పెళ్లెప్పుడు ?..అడిగిన నెటిజన్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక మందన్నా..
రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. పుష్ప సినిమాతో ఈఅమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. సౌత్ లో కాకుండా ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయంటే.. నార్త్ లో రష్మిక ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే హిందీలో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేషనల్ క్రష్. అయితే ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ అక్కడ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.